Mahesh Babu : మహేష్ బాబు సినిమాకి సంబంధించి కొత్త అప్డేట్ ! తండ్రి పాత్రలో ఉపేంద్ర ?

Updated on Jul 04, 2022 12:18 PM IST
 మహేష్ బాబు (Mahesh Babu) నటిస్తున్న ఈ సినిమాలో ఆయన తండ్రిగా బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ నటించే అవకాశం ఉందని గతంలో వార్తలొచ్చాయి.
మహేష్ బాబు (Mahesh Babu) నటిస్తున్న ఈ సినిమాలో ఆయన తండ్రిగా బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ నటించే అవకాశం ఉందని గతంలో వార్తలొచ్చాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు Mahesh Babu) ఇటీవలే 'సర్కారు వారి పాట' సినిమాతో సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ప్రస్తుతం త్రివిక్రమ్‌‌తో ఓ సినిమాను.. అలాగే ఎస్ ఎస్ రాజమౌళితో ఓ సినిమాను సైన్ చేశారు మహేష్. అయితే విచిత్రమేంటంటే, త్రివిక్రమ్‌తో చేస్తున్న సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర మహేష్‌కు తండ్రిగా నటించనున్నారని సమాచారం. 

గతంలో మహేష్ బాబు (Mahesh Babu), త్రివిక్రమ్ కాంబినేషనులో అతడు, ఖలేజా లాంటి సినిమాలు వచ్చి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ దాదాపు పదకొండేళ్ళ తర్వాత, వీరిద్దరూ మళ్లీ ఓ సినిమా చేస్తుండడం విశేషం. వచ్చే నెల నుండి త్రివిక్రమ్ - మహేష్ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుందని సమాచారం. అలాగే పూజా హెగ్డే ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుందట. 

క్రేజీ అప్డేట్

అయితే మొన్నటి వరకు ఇదే సినిమాకి సంబంధించి మరో అప్డేట్ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. మహేష్ బాబు (Mahesh Babu) నటిస్తున్న ఈ సినిమాలో ఆయన తండ్రిగా బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ నటించే అవకాశం ఉందని గతంలో వార్తలొచ్చాయి. ఇప్పడు ఆ పాత్రను ఉపేంద్ర భర్తీ చేయనున్నారని టాక్. అయితే ఈ అంశానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారమూ రాలేదు. 

మంచి ఫామ్‌లో త్రివిక్రమ్

త్రివిక్రమ్ ప్రస్తుతం అరవింద సమేత, అలవైకుంఠాపురంలో లాంటి సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించి మంచి ఫామ్‌లో ఉన్నారు. దీంతో ఆయన మహేష్‌తో చేయబోయే సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అలాగే ఈ సినిమాకు 'అర్జునుడు' అనే పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 

ఇక మహేష్ బాబు, రాజమౌళి సినిమా విషయానికి వస్తే, ఆఫ్రికన్ అడవులలో కథానాయకుడు చేసే సాహసయాత్రల గురించిన కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోందని తెలుస్తోంది. 'సర్కారు వారి పాట' సినిమా హిట్‌తో ప్రస్తుతం మహేష్ బాబు మంచి జోష్ మీద ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే మహేష్ తన కుటుంబంతో కలిసి పలు ఫారిన్ టూర్లు చేస్తూ, యమ బిజీగా ఉన్నారు. 

Read More: న్యూయార్క్ లో షికార్లు చేస్తున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ.. వీడియో వైరల్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!