Mahesh Babu: న్యూయార్క్ లో షికార్లు చేస్తున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ.. వీడియో వైరల్!

Updated on Jun 22, 2022 09:53 PM IST
సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబం (Superstar Mahesh Babu Family)
సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబం (Superstar Mahesh Babu Family)

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన కొత్త సినిమా సర్కారు వారి పాట (Sarkaru Vaari Pata) విజయాన్ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. మహేష్ బాబు- నమ్రతా శిరోద్కర్ జంట వారి పిల్లలు సితార- గౌతమ్ లతో కలిసి విహారంలో ఉన్నారు. ఇన్ స్టాగ్రామ్ లో సూపర్ స్టార్ ఒక చిన్న వీడియోను పోస్ట్ చేసారు. అందులో అతను బిగ్ ఆపిల్ (న్యూయార్క్ కి నిక్ నేమ్)లోని పాపులర్ 5వ అవెన్యూలో షికార్ చేస్తూ కనిపించారు.

ఈ సారి న్యూయార్క్‌లోని మ‌న్‌హ‌ట్ట‌న్ (5th Avenue, Manhattan)లో బిజీగా ఉండే 5th Avenue వెంట న‌డుచుకుంటూ వెళ్లాడు మ‌హేశ్‌. ఈ విజువ‌ల్స్ ను జావియ‌ర్ అగ‌స్టీనా త‌న‌ కెమెరాలో బంధించాడు. వీడియోను మ‌హేశ్ ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ‘5th Avenueలో షికారును మరేదీ అధిగమించలేదు..ఈ దృశ్యాన్ని క్యాప్చర్ చేసిన క్రెడిట్‌ మళ్లీ నా స్నేహితుడైన జావియ‌ర్ అగ‌స్టీనా (xavier augustina)కు వెళ్తుంది.. ’అంటూ క్యాప్ష‌న్ ఇచ్చాడు. మ‌హేశ్‌తోపాటు న‌మ్ర‌త‌ను కూడా వీడియోలో చూడొచ్చు.

అలాగే నమ్రతా శిరోద్కర్ ఫోటో షేరింగ్ యాప్ లో తన భర్త సహా కొందరు స్నేహితులతో కలిసి దిగిన సెల్ఫీని షేర్ చేసారు. ``మంచి ఆహారం.. మంచి వినోదం.. మంచి సమయాలు! మధ్యాహ్న భోజనం ఎల్లప్పుడూ మనవాళ్లందరితో చాలా సరదాగా ఉంటుంది!! #ILoveNYC" అనే క్యాప్షన్ తో పాటుగా దీనిని పోస్ట్ చేసారు. 

మహేష్ బాబు తదుపరి త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో నటించనున్నారు. ప్రస్తుతానికి SSMB28 అని వర్కింగ్ టైటిల్ ని ఫిక్స్ చేయగా ఇది ఈ జోడీకి హ్యాట్రిక్ మూవీ కానుంది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో 2005 లో 'అతడు' వచ్చింది. 2010 లో ఖలేజా కోసం కలిసి పనిచేశారు. ఇప్పుడు హ్యాట్రిక్ మూవీ కోసం కలిసి పని చేస్తున్నారు.

తాజా గుసగుసల ప్రకారం.. SSMB28 లో మహేష్ బాబు (Mahesh Babu) విభిన్నమైన పాత్రను పోషించే అవకాశం ఉంది. కాగా, మ‌హేశ్ బాబు త్వ‌ర‌లో టూర్ ముగించుకుని ఇండియాకు తిరిగిరానున్నాడు. 

Read More: Mahesh Babu: టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఇంటిని మీరెప్పుడైనా చూశారా? నిజంగానే ఇది ఓ అద్భుత నిలయం !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!