Vikram 2 : 'విక్రమ్ 2' సినిమాలో క‌మ‌ల్ హాస‌న్‌, రామ్ చ‌ర‌ణ్ ? ఈ కాంబో కేక అంటున్న ఫ్యాన్స్ !

Updated on Jun 09, 2022 01:12 PM IST
విక్ర‌మ్ 2 (Vikram 2) సినిమాలో క‌మ‌ల్ హాస‌న్ కొడుకుగా రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) న‌టిస్తున్నార‌నే వార్త‌లు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
విక్ర‌మ్ 2 (Vikram 2) సినిమాలో క‌మ‌ల్ హాస‌న్ కొడుకుగా రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) న‌టిస్తున్నార‌నే వార్త‌లు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ (Kamal Haasan) 'విక్ర‌మ్' సినిమా విజ‌య‌వంతం కావ‌డంతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇదే క్రమంలో, 'విక్ర‌మ్' సినిమాకి సీక్వెల్ కూడా తీస్తార‌నే వార్త‌లు ఆన్ లైన్‌లో హల్చల్ చేస్తున్నాయి. ఆ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ కూడా న‌టిస్తున్నారని ఇండస్ట్రీ టాక్. ఇప్పుడు ఇదే టాపిక్  సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. 

ఒకవేళ 'విక్ర‌మ్ 2' సినిమాలో క‌మ‌ల్ హాస‌న్ కొడుకుగా రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) నటిస్తే, అది కచ్చితంగా రేర్ కాంబినేషన్ అవుతుంది.  అలాగే, క‌మ‌ల్, రామ్ .. వీరిద్దరి కాంబినేష‌న్ అదిరిపోతుందంటూ  ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. 

విక్ర‌మ్ 2 (Vikram 2) సినిమాలో క‌మ‌ల్ హాస‌న్ కొడుకుగా రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) న‌టిస్తున్నార‌నే వార్త‌లు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

వ‌రుస సినిమాల‌తో రామ్ చ‌ర‌ణ్ బిజీ
ఆర్.ఆర్.ఆర్. సినిమాలో రామ్ చ‌ర‌ణ్ త‌న న‌ట‌న‌తో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకున్నారు. ఉత్తరాదిలో కూడా పలువురు సినీ విమర్శకుల ప్రశంసలు పొందారు. మన్నెం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుని పోలిన పాత్రలో న‌టించి.. ఇటు ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లూ అందుకున్నారు. ఆ త‌ర్వ‌ాత త‌న తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన సినిమా 'ఆచార్య‌'తో డీలా ప‌డ్డారు.

తండ్రి కోసం రామ్ న‌టించినా.. 'ఆచార్య' క‌థ‌ను ప్రేక్ష‌కులు ఆద‌రించ‌లేదు. కానీ రామ్ చ‌ర‌ణ్ మాత్రం త‌న‌దైన స్టైల్‌లో సినిమాలు చేసుకుపోతున్నారు. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 15 వ సినిమా చేస్తున్నారు. ఆర్‌సీ 15 అనే టెంప‌ర‌రీ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. అలాగే, జెర్సీ’మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో రామ్ మ‌రో సినిమాకి సైన్ చేశారు.

కొర‌టాల శివ‌తో పాటు కేజీఎఫ్ చాప్ట‌ర్ 2తో రికార్డులు సృష్టించిన.. ప్ర‌శాంత్ నీల్‌తో కూడా రామ్ చ‌ర‌ణ్ ఓ సినిమా చేయ‌నున్నారు. అయితే అన్నింటికంటే ఓ బిగ్ అప్‌డేట్ ఇప్పుడు ప్రేక్ష‌కుల‌కు ఆశ్చ‌ర్యం క‌లిగిస్తుంది. రామ్ చరణ్  క‌మ‌ల్ హాస‌న్‌తో మ‌రో సినిమా చేస్తున్నారనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. 

విక్ర‌మ్ 2 (Vikram 2) సినిమాలో క‌మ‌ల్ హాస‌న్ కొడుకుగా రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) న‌టిస్తున్నార‌నే వార్త‌లు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

రామ్ చ‌ర‌ణ్ తండ్రిగా క‌మ‌ల్
క‌మ‌ల్ హాస‌న్ నాలుగేళ్ల త‌ర్వాత 'విక్ర‌మ్' సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. 'విక్ర‌మ్' సినిమా రెండు రోజుల్లో రూ. 100 కోట్లు రాబ‌ట్టి బ్లాక్ బాస్ట‌ర్ హిట్‌గా నిలిచింది. 'విక్ర‌మ్' చిత్రానికి సీక్వెల్‌గా విక్ర‌మ్ 2 తీయాల‌ని ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్ నిర్ణ‌యించుకున్నార‌ట‌.

ఈ సినిమాలో క‌మ‌ల్ హాస‌న్ కొడుకుగా రామ్ చ‌ర‌ణ్‌ను తీసుకోవాల‌ని భావిస్తున్నారట. అందుకు రామ్ చ‌ర‌ణ్ కూడా ఒప్పుకున్నార‌ని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఏదీ విడుదల కాలేదు.

' విక్ర‌మ్'  సినిమా తెలుగు ట్రైల‌ర్‌ను రామ్ చ‌ర‌ణ్ రిలీజ్ చేశారు. దీనిని బ‌ట్టి రామ్ చ‌ర‌ణ్ 'విక్ర‌మ్ '2లో కీల‌క పాత్ర చేస్తున్నార‌ని ఫిక్స్ అయిపోవ‌చ్చు అంటున్నారు ఫ్యాన్స్.  'విక్ర‌మ్' లో రోలెక్స్ పాత్ర‌లో మెప్పించిన సూర్య. విక్రమ్ 2 లోనూ విల‌న్‌గా క‌నిపిస్తార‌ట‌.

అలాగే లోకేష్ క‌న‌గ‌రాజ్ ప్ర‌స్తుతం ద‌ళ‌ప‌తి విజ‌య్‌తో సినిమా చేస్తున్నారు. ఏదేమైనా,  క‌మ‌ల్, రామ్, సూర్య కాంబోలో సినిమా అనే వార్త నిజమైతే, అది కచ్చితంగా ఫ్యాన్స్‌కు పెద్ద పండగే. 

Read More:  విక్ర‌మ్ (Vikram) సినిమాను తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రించ‌డం నా అదృష్టం : క‌మ‌ల్ హాస‌న్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!