విక్రమ్ (Vikram) ద‌ర్శ‌కుడికి ఖ‌రీదైన కానుక‌ను ఇచ్చిన‌ క‌మ‌ల్ హాస‌న్

Updated on Jun 08, 2022 09:17 AM IST
భారీ హిట్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్‌కు క‌మ‌ల్ హాసన్ (Kamal Haasan) కాస్టీ గిఫ్ట్ ఇచ్చారు.
భారీ హిట్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్‌కు క‌మ‌ల్ హాసన్ (Kamal Haasan) కాస్టీ గిఫ్ట్ ఇచ్చారు.

విక్ర‌మ్ సినిమా బ్లాక్ బాస్ట‌ర్ హిట్ సాధించిడంతో క‌మ‌ల్ హాసన్ (Kamal Haasan) ఫుల్ జోష్‌లో ఉన్నారు. జూన్ 3న విడుద‌లైన విక్ర‌మ్ రెండు రోజుల్లోనే వంద కోట్ల రూపాయ‌ల‌ను కొల్ల‌గొట్టింది. షో షోకు క‌మ‌ల్ హాస‌న్ సినిమా క‌లెక్ష‌న్ పెరుగుతుంది. విక్ర‌మ్ సినిమా లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రిలీజ్ అయింది. తెలుగు, త‌మిళ్ భాష‌ల్లో ఈ చిత్రం దుమ్ము రేపు క‌లెక్ష‌న్‌ను సాధిస్తుంది. 

భారీ హిట్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్‌కు క‌మ‌ల్ హాసన్ (Kamal Haasan) కాస్టీ గిఫ్ట్ ఇచ్చారు. ఓ ఖ‌రీదైన కారును లోకేష్‌కు కానుక‌గా ఇచ్చారు. కోటి విలువైన ల‌గ్జ‌రీ కారును కొనిచ్చారు. కోటి రూపాయలకి పైగా ఖరీదైన లెక్సస్ సెడాన్ కారును ఇచ్చి క‌మ‌ల్ త‌న అభిమానాన్ని చూపించారు. క‌మ‌ల్ ఇచ్చిన కానుక‌తో లోకేష్ ఫుల్ ఖుషీ అయ్యాడు. కారు ప‌క్క‌న క‌మ‌ల్‌, లోకేష్‌లు దిగిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. త‌న‌కు స‌ప్రైజ్ గిఫ్ట్ వ‌చ్చిందంటూ పోస్ట్ చేశారు. 

భారీ హిట్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్‌కు క‌మ‌ల్ హాసన్ (Kamal Haasan) కాస్టీ గిఫ్ట్ ఇచ్చారు.

 ఓటీటీ హక్కులను హాట్ స్టార్ భారీ ధరకు కొనుగోలు

'విక్ర‌మ్' సినిమా లోకేష్ క‌న‌గ‌రాజ్ (#LokeshKanagaraj) ద‌ర్శ‌క‌త్వంలో రిలీజ్ అయింది. విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ఈ సినిమాలో విల‌న్‌గా న‌టించారు. అలాగే ఫహద్ ఫాజిల్ లీడ్ రోల్‌లో యాక్ట్ చేశారు. అలాగే,  హీరో సూర్య 'విక్ర‌మ్' సినిమాలో గెస్ట్ రోల్‌లో కనిపించారు. మొద‌టి రోజు విక్ర‌మ్ రూ. 50.75 కోట్ల‌ను వ‌సూళ్లు చేసింది. అలాగే,  ఓటీటీ హక్కులను హాట్ స్టార్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు స‌మాచారం. హాట్ స్టార్ యాజమాన్యం తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా విక్ర‌మ్ (Vikram) సినిమాను స్ట్రీమింగ్ చేసేందుకు ఒప్పందం చేసుకుందని ఇండస్ట్రీ టాక్. 

Read More ;https://telugu.pinkvilla.com/entertainment/indian-actor-kamal-haasan-vikram-movie-review-978

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!