డ్రైవ‌ర్ బ‌ర్త్ ‌డే కోసం.. సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిన రామ్ చరణ్ (Ram Charan), ఉపాస‌న‌ దంపతులు !

Updated on Jun 07, 2022 07:55 PM IST
త‌న డ్రైవ‌ర్ న‌వీన్ పుట్టిన‌రోజు కావ‌డంతో రామ్  (Ram Charan), ఉపాస‌న‌లు ద‌గ్గ‌రుండి ఆయన చేత కేక్ క‌ట్ చేయించారు.
త‌న డ్రైవ‌ర్ న‌వీన్ పుట్టిన‌రోజు కావ‌డంతో రామ్ (Ram Charan), ఉపాస‌న‌లు ద‌గ్గ‌రుండి ఆయన చేత కేక్ క‌ట్ చేయించారు.

టాలీవుడ్‌లో రామ్ చ‌ర‌ణ్ సినిమా, సినిమాకు తన క్రేజ్‌ను పెంచుకుంటున్నారు. ప్ర‌తీ సినిమాలోనూ త‌న క్యారెక్ట‌ర్ వైవిధ్యంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి వార‌సుడిగానే కాకుండా,  రామ్ చ‌ర‌ణ్ త‌నదైన హార్డ్ వర్క్‌తో, టాలెంట్‌తోనూ మంచి పేరు తెచ్చుకున్నారు.

ఆర్.ఆర్.ఆర్ సినిమా రామ్ చరణ్ నట విశ్వరూపానికి ప్రతీక. అల్లూరి సీతారామ‌రాజును పోలిన పాత్రలో న‌టించి, తన ఫాలోయింగ్‌ను మ‌రింత పెంచుకున్నారు రామ్. ఇదే క్రమంలో, ఉత్తరాదిలో కూడా విమర్శకుల ప్రశంసలు పొందారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు.

నిరాడంబరమైన జీవనశైలికే రామ్ చరణ్  ప్రాధాన్యం

రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) చాలా హుందాగా, నిరాడంబరంగా ఉంటారు. ప్ర‌తీ ఒక్క‌రినీ గౌర‌విస్తారు. ఆయన భార్య ఉపాస‌న కూడా గొప్ప వ్య‌క్తిత్వం క‌లిగిన అమ్మాయి. ఇక రామ్, ఉపాస‌న‌లు ఏ ఫంక్ష‌న్‌కు వెళ్లినా.. అందరినీ అప్యాయంగా ప‌ల‌కరిస్తూ, సెంట్రాఫ్ ఎట్రాక్ష‌న్‌గా నిలుస్తుంటారు. తమ పొరుగువారినీ గౌర‌విస్తూ మ‌ర్యాద‌గా మాట్లాడుతుంటారు.

త‌న డ్రైవ‌ర్ న‌వీన్ పుట్టిన‌రోజు కావ‌డంతో రామ్  (Ram Charan), ఉపాస‌న‌లు ద‌గ్గ‌రుండి కేక్ క‌ట్ చేయించారు.

రామ్ చరణ్ ఆధ్వర్యంలో డ్రైవర్ 'బర్త్‌ డే'  వేడుకలు

ఇటీవలే తన కారు డ్రైవ‌ర్‌ కోసం, ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) ఓ అనుకోని స‌ర్‌ప్రైజ్ ప్లాన్ చేశారు.  తన కారు డ్రైవ‌ర్ నవీన్ పుట్టిన రోజు వేడుక‌లను తన కార్యాలయంలోనే జరిపించారు.  రామ్, ఉపాస‌న‌లు ద‌గ్గ‌రుండి ఆయనతో కేక్ క‌ట్ చేయించారు. ఇప్పుడు ఆ వేడుకకు సంబంధించిన చిత్రాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావడం గమనార్హం.

వీటిని చూశాక, రామ్ చ‌ర‌ణ్ త‌న ద‌గ్గ‌ర ప‌నిచేసే వారిని, ఎంతలా గౌర‌విస్తారో తెలుస్తుందంటూ నెటిజ‌న్లు పోస్టులు పెడుతున్నారు. తన ఉద్యోగులను, రామ్ చరణ్ తన సొంత మనుషుల్లా చూసుకుంటారని గతంలో కూడా పలు వార్తలు రావడం విశేషం. 

 

త‌న డ్రైవ‌ర్ న‌వీన్ పుట్టిన‌రోజు కావ‌డంతో రామ్  (Ram Charan), ఉపాస‌న‌లు ద‌గ్గ‌రుండి కేక్ క‌ట్ చేయించారు.

తాజాగా రామ్ చరణ్ జరిపించిన పుట్టినరోజు వేడుకలకు స్పందనగా.. ఆయన ఓ గొప్ప వ్య‌క్తిత్వం ఉన్న వ్య‌క్త‌ని, ఆయన మంచి మ‌న‌సుకు సెల్యూట్ అని పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. రామ్ తన డ్రైవర్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన ఈ చిరు కార్యక్రమంలో, ఆయన  స్టాఫ్ కూడా పాల్గొన్నారు. అంతేకాదు రామ్, ఉపాస‌న (Upasana) లు ఎంతో ఇష్టంగా పెంచుకునే కుక్క పిల్ల‌లు కూడా అక్కడ సందడి చేయడం విశేషం. 

Read More: వంద‌ల కిలో మీట‌ర్ల‌ను న‌డిచేలా చేసిన అభిమానం - రామ్ చ‌రణ్ (Ram Charan) కు ఊహించ‌ని గిఫ్ట్

 

త‌న డ్రైవ‌ర్ న‌వీన్ పుట్టిన‌రోజు కావ‌డంతో రామ్  (Ram Charan), ఉపాస‌న‌లు ద‌గ్గ‌రుండి కేక్ క‌ట్ చేయించారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!