రోలెక్స్‌గా న‌టించినందుకు సూర్యకు స‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన క‌మ‌ల్ హాస‌న్ (Kamal Haasan)

Updated on Jun 10, 2022 02:23 PM IST
టాప్ వాచ్ బ్రాండ్ రోలెక్స్‌కు చెందిన ఖ‌రీదైన వాచ్‌ను సూర్య‌కు ఇచ్చారు క‌మ‌ల్‌  (Kamal Haasan).
టాప్ వాచ్ బ్రాండ్ రోలెక్స్‌కు చెందిన ఖ‌రీదైన వాచ్‌ను సూర్య‌కు ఇచ్చారు క‌మ‌ల్‌  (Kamal Haasan).

విక్ర‌మ్ స‌క్సెస్‌తో క‌మ‌ల్ హాస‌న్ (Kamal Haasan) ఆనందంతో పొంగిపోతున్నారు. లోకేష్ క‌నగ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో విడుద‌లైన విక్ర‌మ్ (Vikram) వంద‌ల కోట్ల రూపాయ‌ల వ‌సూళ్లుతో దూసుకుపోతుంది. విక్ర‌మ్ బ్లాక్ బాస్ట‌ర్ హిట్ కావ‌డంతో క‌మ‌ల్ హాస‌న్ చాలా ఆనంద ప‌డుతున్నారు. ఆ ఆనందంలో విక్ర‌మ్ టీంకు భారీ కానుక‌లు ఇస్తూ స‌ప్రైజ్ చేస్తున్నారు. ద‌ర్శ‌కుడు లోకేష్ కన‌గ‌రాజ్ కోసం ల‌గ్జ‌రీ బ్రాండ్ కానుక‌గా ఇచ్చారు. సూర్య స్పెష‌ల్ రోల్‌లో విక్ర‌మ్ సినిమాలో న‌టించారు. అందుకు క‌మ‌ల్ సూర్య‌కు రోలెక్స్ వాచ్ గిఫ్ట్‌గా ఇచ్చారు.

విక్ర‌మ్ భారీ స‌క్సెస్ కావ‌డంతో త‌న టీమ్‌కు బ‌హుమ‌తులు అందిస్తున్నారు విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్  (Kamal Haasan).  

రోలెక్స్‌కు రోలెక్స్ వాచ్
విక్ర‌మ్ (Vikram) సినిమాలో న‌టించిన సూర్య ఒక్క రూపాయి కూడా రెమ్యూన‌రేష‌న్ తీసుకోలేదు. విక్ర‌మ్ స‌క్సెస్ సాధించ‌డంతో క‌మ‌ల్ హాస‌న్ సూర్య కోసం ఓ స‌ప్రైజ్ ప్లాన్ చేశారు. సూర్య ఇంటికి వెళ్లి మ‌రీ ఆ బ‌హుమ‌తి ఇచ్చారు. టాప్ వాచ్ బ్రాండ్ రోలెక్స్‌కు చెందిన ఖ‌రీదైన వాచ్‌ను సూర్య‌కు ఇచ్చారు క‌మ‌ల్‌. అంతేకాదు క‌మ‌ల్ త‌న చేత్తో సూర్య‌కు వాచ్ కూడా పెట్టారు. క‌మ‌ల్ హాస‌న్‌తో పాటు విక్ర‌మ్ ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్ కూడా సూర్య ఇంటికి వెళ్లారు. సూర్య తండ్రి, న‌టుడు శివ‌కుమార్ విక్ర‌మ్ టీంను ప్ర‌శంసించారు. క‌మ‌ల్‌తో త‌న‌కు ఉన్న అనుబంధం గుర్తుచేసుకున్నారు. క‌మ‌ల్‌ను చూడ‌గానే శివ‌కుమార్ అప్యాయంగా హ‌త్తుకున్నారు. 

విక్ర‌మ్ భారీ స‌క్సెస్ కావ‌డంతో త‌న టీమ్‌కు బ‌హుమ‌తులు అందిస్తున్నారు విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్  (Kamal Haasan).  

క‌మ‌ల్ అన్నకు థాంక్స్ - సూర్య‌ (Suriya )
సూర్య‌కు క‌మ‌ల్ ఇచ్చిన గిప్ట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. క‌మ‌ల్ ఇచ్చిన కానుక‌ను సూర్య ఎంతో ఇష్టంగా స్వీక‌రించారు. త‌న చేసి గ‌డియారం ఫోటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు సూర్య‌. త‌న‌కు కానుక ఇచ్చిన క‌మ‌ల్ అన్న‌కు థాంక్స్ అంటూ సూర్య త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. క‌మ‌ల్ అన్న బ‌హుమ‌తి ఇచ్చిన స‌మ‌యం జీవితాన్ని ఎంతో అందంగా మార్చిందని తెలిపారు. 

విక్ర‌మ్ సినిమాలో సూర్య చేసిన పాత్ర పేరు రోలెక్స్. ఓ ప్ర‌త్యేక పాత్ర‌లో సూర్య విక్ర‌మ్ మూవీలో న‌టించారు. రోలెక్స్‌కు రోలెక్స్ బ‌హుమ‌తి ఇచ్చారంటూ సోష‌ల్ మీడియాలో అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. క‌మ‌ల్ హాస‌న్ విక్ర‌మ్ టీంకు బైకులు కూడా గిప్ట్‌లుగా ఇచ్చారు. విక్ర‌మ్ భారీ స‌క్సెస్ కావ‌డంతో త‌న టీమ్‌కు బ‌హుమ‌తులు అందిస్తున్నారు విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్.  
 
 

విక్ర‌మ్ భారీ స‌క్సెస్ కావ‌డంతో త‌న టీమ్‌కు బ‌హుమ‌తులు అందిస్తున్నారు విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్  (Kamal Haasan).  

విక్ర‌మ్ (Vikram) సినిమా రిలీజ్ అయిన రెండు రోజుల్లో వంద కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూళ్లు చేసింది. వారంలో రూ. 500 కోట్ల‌ను వ‌సూళ్లు చేస్తుంద‌ని సినీ ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. విజ‌య్ సేతుప‌తి విలన్‌గా న‌టించి విక్ర‌మ్‌లో మెప్పించారు. ఇక క‌మ‌ల్ విజ‌య్‌కు ఎలాంటి బ‌హుమ‌తి అందిస్తారో చూడాలి.

Read More :  అడ‌విలో వెలుగు .. నిర్ణ‌యించేది ప్ర‌కృతి కాదు : క‌మ‌ల్ హాస‌న్

విక్ర‌మ్ భారీ స‌క్సెస్ కావ‌డంతో త‌న టీమ్‌కు బ‌హుమ‌తులు అందిస్తున్నారు విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్  (Kamal Haasan).  

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!