విక్రమ్ (Vikram) సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరించడం నా అదృష్టం : కమల్ హాసన్
విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Haasan) నటించిన విక్రమ్ (Vikram) బ్లాక్ బాస్టర్ హిట్ సాధించింది. చాలా ఏళ్ల తర్వాత కమల్ హాసన్ 'విక్రమ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే రూ.100 కోట్లను కొల్లగొట్టింది ఇదే క్రమంలో, కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సందర్భంగా కమల్ హాసన్ ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు. అన్ని భాషల్లో కమల్ హాసన్ మాట్లాడి తన అభిమానులను అలరించారు. ఈ సందర్భంగా, ఆడియన్స్‌కు, 'విక్రమ్' చిత్ర యూనిట్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు - కమల్ హాసన్
తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా ఓ వీడియో చేశారు కమల్ హాసన్. మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ ఆదరిస్తారని ఆయన తెలిపారు. 'ప్రేక్షకులు మంచి నటులకు ఎప్పుడూ మద్దతు తెలుపుతారు. విక్రమ్ (Vikram) సినిమాను తెలుగువారు మంచి సినిమాగా ఆదరించారు. ఇదే క్రమంలో నాకు పెద్ద హిట్‌ను అందించారు ' అని చెబుతూ కమల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.
తెలుగు ప్రేక్షకులు 'విక్రమ్' సినిమాను బ్లాక్ బాస్టర్ హిట్ చేయడం తన అదృష్టం అని కమల్ అన్నారు. చివరి మూడు నిమిషాలు థియేటర్లు దద్దరిల్లేలా విక్రమ్ క్లైమాక్స్ ఉంటుందన్నారు. తన తమ్ముడిగా భావించే ప్రముఖ నటుడు సూర్య, ఓ వైవిధ్యమైన పాత్రలో అదరగొట్టారన్నారు.
సూర్య నటనకు కృతజ్ఞతగా.. త్వరలో తనతో మరల కలిసి నటించి తానేంటో నిరూపిస్తానని కమల్ హాసన్ తెలిపారు. అలాగే దర్శకుడు లోకేష్‌కు తానంటే ఎంతో అభిమానమని చెప్పారు. ఇక అభిమానులపై ఈ ప్రేమ ఎప్పటికీ కొనసాగుతుందని కమల్ తెలిపారు.
ఓటీటీ రైట్స్ ఎవరికంటే?
'విక్రమ్' సినిమా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రిలీజ్ అయింది. విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ఈ సినిమాలో విలన్‌గా నటించారు. అలాగే ఫహద్ ఫాజిల్ లీడ్ రోల్‌లో యాక్ట్ చేశారు. అలాగే, హీరో సూర్య 'విక్రమ్' సినిమాలో గెస్ట్ రోల్‌లో కనిపించారు. మొదటి రోజు విక్రమ్ రూ. 50.75 కోట్లను వసూళ్లు చేసింది. అలాగే, ఓటీటీ హక్కులను హాట్ స్టార్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. హాట్ స్టార్ యాజమాన్యం తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా విక్రమ్ (Vikram) సినిమాను స్ట్రీమింగ్ చేసేందుకు ఒప్పందం చేసుకుందని ఇండస్ట్రీ టాక్.
Read More:https://telugu.pinkvilla.com/entertainment/indian-actor-kamal-haasan-vikram-movie-review-978