కె.రాఘవేంద్రరావు సమర్పణలో.. సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) హీరో ! సినిమా పేరు 'వాంటెడ్ పండుగాడ్'

Updated on Jul 11, 2022 05:12 PM IST
సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) గతంలో 'సాఫ్ట్ వేర్ సుధీర్' అనే తెలుగు చిత్రం ద్వారా తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యారు.
సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) గతంలో 'సాఫ్ట్ వేర్ సుధీర్' అనే తెలుగు చిత్రం ద్వారా తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యారు.

తెలుగులో మంచి కమర్షియల్ చిత్రాలతో పాటు అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి భక్తిరస చిత్రాలను కూడా తెరకెక్కించిన మేటి దర్శకుడు కె.రాఘవేంద్రరావు. ఆయన సమర్పణలో యునైటెడ్ కె ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం 'వాంటెడ్ పండుగాడ్'. సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer), దీపికా పిల్లి (Deepika Pilli) ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీధర్ సీపాన దర్శకత్వం వహిస్తున్న ఈ కామెడీ చిత్రంలో అనేకమంది హాస్యనటులు నటిస్తున్నారు. 

సునీల్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సప్తగిరి, శ్రీనివాసరెడ్డి, అనంత్,  రఘుబాబు, తనికెళ్ళ భరణి, షకలక శంకర్ మొదలైన కమెడియన్స్ అందరూ ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు నవ్వులు పంచబోతున్నారు. అలాగే యాంకర్ అనసూయ ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. సాయిబాబ కోవెలమూడి, వెంకట్ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 

ఆగస్టు 19 తేదిన ఈ చిత్రం విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను నిర్మాతలు విడుదల చేశారు. జబర్దస్త్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైన వ్యక్తి సుధీర్.  గతంలో సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) 'సాఫ్ట్ వేర్ సుధీర్' అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యారు. ప్రస్తుతం 'గాలోడు' అనే చిత్రంతో పాటు ఈ సినిమాలో కూడా నటిస్తున్నారు. 

ఈ సినిమా గురించి దర్శకుడు శ్రీధర్ మాట్లాడుతూ 'ఈ సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఓ దర్శకుడిగా పరిచయమవ్వడం సంతోషంగా ఉంది. రాఘవేంద్రరావు గారు దర్శకత్వానికి సంబంధించిన టిప్స్ నాకు చాలా బాగా ఉపయోపపడ్డాయి. ఈ సినిమాలోని పాటలు కూడా దాదాపు ఆయన స్టైల్‌లోనే ఉంటాయి' అని తెలిపారు. 

'వాంటెడ్ పండుగాడ్' సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, మాటలను ప్రముఖ రచయిత జనార్థన మహర్షి అందించారు. అలాగే పీఆర్ మ్యూజిక్ అందించగా, తమ్మిరాజు ఎడిటింగ్ బాధ్యతలను స్వీకరించారు. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ యూట్యూబ్ ద్వారా విడుదలై, సినీ అభిమానులను అలరిస్తోంది. 

Read More: సుడిగాలి సుధీర్ కోసం యాంకర్ రష్మి దీక్ష.. కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రోమో!


 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!