Jabardasth: జ‌బర్ద‌స్త్ షో కు గుడ్ బై చెప్పేసిన స్టార్ క‌మెడియ‌న్లు హైప‌ర్ ఆది, సుడిగాలి సుధీర్

Updated on May 24, 2022 09:43 PM IST
హైప‌ర్ ఆది, సుడిగాలి సుధీర్ (Hyper Adi, Sudigali Sudheer)
హైప‌ర్ ఆది, సుడిగాలి సుధీర్ (Hyper Adi, Sudigali Sudheer)

తెలుగు బుల్లితెర‌పై ప్ర‌సార‌మ‌వుతున్న కామెడీ షో జబర్దస్త్ (Jabardasth). ఈ షో నుంచి మెజారిటీ కమెడియన్స్ దూరమైనా... హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ టీమ్ లు ప్రేక్షకులకు ఎటువంటి లోటు లేకుండా వినోదం పంచుతూ వస్తున్నారు. అయితే, జబర్దస్త్ కి హైపర్ ఆది, ఎక్స్ట్రా జబర్దస్త్ కి సుడిగాలి సుధీర్ ప్రత్యేక ఆకర్షణ అని చెప్ప‌వ‌చ్చు. ఈ రెండు టీమ్ లు చేసే స్కిట్స్ కోసమే ఈ షోలను చూసే ప్రేక్షకులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. 

హైప‌ర్ ఆది నాన్ స్టాప్ పంచ్ లకు ఫేమస్ కాగా... సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) టీమ్ స‌భ్యుల‌ కామెడీ టైమింగ్, గెటప్ శ్రీను వేషాలు, రామ్ ప్రసాద్ ఆటో పంచ్ లు పిచ్చ ఫేమస్. అయితే, ఇప్ప‌టికే ముక్కు అవినాష్, అదిరే అభి, చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీ, అప్పారావు వంటి కమెడియన్స్ షోని వీడారు. అయినప్పటికీ హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ ఈ రెండు షోలను తమ భుజాలపై మోస్తూ నెట్టుకొస్తున్నారు. అయితే, దాదాపు పదేళ్ల జబర్ధస్త్ ప్రస్థానంలో   ఈ షో వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. ఎన్నోసార్లు అత్యధిక టీఆర్పీ కలిగిన షోగా రికార్డులను బ్రేక్ చేసింది. 

ఈ నేప‌థ్యంలో తాజాగా హైపర్ ఆది,(Hyper Aadi) సుడిగాలి సుధీర్ జబర్దస్త్ వదిలేసినట్లు తెలుస్తోంది. ఇకపై వీరిద్దరూ షోలో కనిపించే ఆస్కారం లేన‌ట్లు తెలుస్తోంది. కొన్ని వారాలుగా హైపర్ ఆది జబర్దస్త్ షోలో కనిపించడం లేదు. అలాగే గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ లేకుండానే గత ఎపిసోడ్ లో రామ్ ప్రసాద్ స్కిట్ చేశారు. వెండితెరపై హైపర్ ఆది, సుధీర్ లకు విరివిగా అవకాశాలు వస్తున్నాయి. హైపర్ ఆదికి కామెడీ రోల్స్ దక్కుతున్నాయి. సుధీర్ అయితే ఏకంగా హీరోగా సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన హీరోగా నటించిన సాఫ్ట్ వేర్ సుధీర్, త్రీ మంకీస్ చిత్రాలు విడుదలయ్యాయి. మరో మూడు చిత్రాలు ఇంకా సెట్స్ పై ఉన్నాయి. 

ఈ కారణంగానే ఈ స్టార్ కమెడియన్స్ జబర్దస్త్ షోకి (Jabardasth) దూరమైనట్లు తెలుస్తోంది. అలాగే వీరికి వ‌చ్చే రెమ్యూనరేషన్స్ కూడా ఓ కారణంగా తెలుస్తోంది. ఏదైతేనేం వీరిద్దరూ లేకపోవడం జబర్దస్త్ కి చాలా పెద్ద లోటు. ఖచ్చితంగా షోకు ప్రేక్షకుల ఆదరణ తగ్గిపోయే ప్రమాదం ఉంది. మరోవైపు ఇప్ప‌టికే గెటప్ శ్రీను కూడా గుడ్ బై చెప్పేశాడట. ఈ షోకి ఎంతో ప్రత్యేకత తీసుకొచ్చిన స్టార్స్ ఒక్కొక్కరిగా దూరం అవుతున్నారు. మెగా బ్ర‌ద‌ర్ నాగబాబు 2019లో షోని వీడగా.. మంత్రి పదవి రావడంతో ఇటీవల రోజా జబర్దస్త్ నుంచి వెళ్లిపోయారు. ఇప్పుడు ఈ షోలో పెర్ఫార్మ్ చేస్తున్న టీమ్స్ అన్నీ చాలా కొత్తవే అని చెప్పాలి. ఈ టీమ్స్ లో ఉండే హాస్యన‌టులు మునుపటి కమెడియన్స్ మాదిరిగా నవ్వులు పూయించలేకపోతున్నారు. మొత్తంగా ఒకప్పుడు తిరుగులేకుండా వెలిగిపోయిన జబర్దస్త్ షోకి ప్ర‌స్తుతం కష్టకాలం వచ్చింది. 
 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!