'బిగ్ బాస్ సీజన్ 6' నిర్వాహకులు అదిరిపోయే ప్లాన్.. సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) వైల్డ్ కార్డ్ ఎంట్రీ?

Updated on Oct 06, 2022 03:28 PM IST
సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) ను భారీ రెమ్యూనరేషన్ ఇచ్చి హౌస్ లోకి దింపేందుకు బిగ్ బాస్ నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) ను భారీ రెమ్యూనరేషన్ ఇచ్చి హౌస్ లోకి దింపేందుకు బిగ్ బాస్ నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ (Telugu Biggboss) ప్రసారమవుతుందన్న సంగతి తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ఐదు సీజ‌న్లు బంప‌ర్ హిట్ కొట్ట‌డంతో.. ఆరో సీజ‌న్ పై మంచి హైప్ నెలకొంది. అయితే, గత సీజన్ల తరహాలో రేటింగ్స్ ను సొంతం చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్న సంగతి తెలిసిందే. కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియలో జరిగిన తప్పులే బిగ్ బాస్ షో.. పూర్ రేటింగ్స్ కు కారణమని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో బిగ్ బాస్ సీజన్ 6 (Biggboss Season 6) నిర్వాహకులు ఎలాగైనా షో పై ఆసక్తిని మరింత పెంచి రేటింగ్ ను పెంచుకోవాలని ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇంటి సభ్యులతో సరికొత్తగా టాస్కులు ఆడించి ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ బుల్లితెర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవడంతో చివరికి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఒక కొత్త కంటెస్టెంట్ ని హౌస్ లోకి తీసుకురావాలని బిగ్ బాస్ నిర్వాహకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఈ క్రమంలో సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) ను భారీ రెమ్యూనరేషన్ ఇచ్చి మరీ హౌస్ లోకి దింపేందుకు బిగ్ బాస్ నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. లేటుగా, లేటెస్టుగా లిస్టులోకి వ‌చ్చిన పేరు సుడిగాలి సుధీర్‌ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయం అంటున్నారు. ఈ మాజీ జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ ను ఆరో సీజ‌న్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపిస్తారనే వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఇందుకోసం ఆయనకు భారీగా రెమ్యున‌రేష‌న్ ఇస్తున్న‌ట్టు టాక్‌ నడుస్తోంది.
 
మరోవైపు.. గత కొంతకాలంగా సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) ఏ షోలో కనిపించడం లేదు. జీ తెలుగు ఛానల్ లో ప్రసారమయ్యే ఒక ఈవెంట్ లో సుధీర్ కనిపిస్తున్నా ఆ షోకు సుధీర్ గెస్ట్ గా మాత్రమే హాజరయ్యారనే సంగతి తెలిసిందే. సుధీర్ కంటిన్యూగా చేసే షోలు అయితే ఆయన చేతిలో లేవు. బిగ్ బాస్ షోకు వెళ్లడం వల్ల సెలబ్రిటీలు ఆర్థికంగా కూడా సెటిల్ అయ్యే అవకాశం ఉంది. కాగా, సుధీర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాతైనా బిగ్ బాస్ షో ఫేట్ మారుతుందేమో చూడాలి.

Read More: Biggboss Season 6: బిగ్ బాస్ సీజన్ 6 ఆ కంటెస్టెంట్ ఎలిమినేట్.. వెక్కి వెక్కి ఏడ్చిన ఆర్జే సూర్య (RJ Surya)!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!