గుడ్ న్యూస్ చెప్పిన సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer).. ‘జబర్దస్త్’ షోకు రీఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు

Updated on Nov 05, 2022 12:41 PM IST
‘జబర్దస్త్’ షోను ఎందుకు వీడారనే ప్రశ్నకు సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) ఆసక్తికర సమాధానం చెప్పారు
‘జబర్దస్త్’ షోను ఎందుకు వీడారనే ప్రశ్నకు సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) ఆసక్తికర సమాధానం చెప్పారు

ప్రముఖ కమెడియన్, నటుడు సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer)కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘జబర్దస్త్’ (Jabardasth Show) కామెడీ షోతో సినీ పరిశ్రమలోకి వచ్చిన సుధీర్.. చక్కటి వినోదాన్ని పండిస్తూ పాపులారిటీ సంపాదించారు. ఆయనకు యూత్‌లో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ‘జబర్దస్త్’ షోతో వచ్చిన పేరుతో సినిమాల్లోనూ ఆయనకు అవకాశాలు వస్తున్నాయి. ఒకవైపు కమెడియన్‌గా నటిస్తూనే.. మరోవైపు హీరోగానూ ఆయన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 

సుడిగాలి సుధీర్ ‘జబర్దస్త్’ షో నుంచి బయటకు రావడం ఆయన అభిమానులను నిరాశ పర్చింది. మళ్లీ ఆ షోకు సుధీర్ వస్తే బాగుండేదని కోరుకుంటున్నారు. ఇక, ప్రస్తుతం సుధీర్ ‘గాలోడు’ (Gaalodu Movie) అనే మూవీతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం నవంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానల్‌లో సుధీర్ ముచ్చటించారు. ఈ సందర్భంగా ‘జబర్దస్త్’ నుంచి బయటకు రావడంపై ఆయన స్పందించారు. ‘జబర్దస్త్’ షో సుధీర్ తన జీవితంలో టర్నింగ్ పాయింట్ అని సుధీర్ చెప్పారు. 

జబర్దస్త్ షోనే తనను ఈ ప్రపంచానికి పరిచయం చేసిందని సుధీర్ అన్నారు. మరి ఆ షో నుంచి ఎందుకు బయటకు వచ్చారని ఆ ఇంటర్వ్యూలో యాంకర్ అడగ్గా.. రాలేదని, మళ్లీ వస్తానంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘జబర్దస్త్’ షోకి త్వరలో రీఎంట్రీ ఇస్తానని సుధీర్ స్పష్టం చేశారు. పలు ఆర్థిక సమస్యల కారణంగానే ఆ షో నుంచి బయటకు వచ్చానని తెలిపారు.

‘జబర్దస్త్ షోను నేను విడిచి పెట్టలేదు. ఒక ఆరు నెలలు విరామం తీసుకున్నానంతే. కొన్ని ఆర్థిక సమస్యల కారణంగానే నేను గ్యాప్ తీసుకున్నా. ఇదే విషయాన్ని నిర్మాతలకు కూడా వివరించా. దీనికి వారు సరేనన్నారు. అతి త్వరలో మళ్లీ ‘జబర్దస్త్’లోకి కమ్ బ్యాక్ ఇవ్వబోతున్నా’ అని సుధీర్ చెప్పుకొచ్చారు. ఆయన మాటలు విని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

Read more: ‘పుష్ప’, ‘ది కశ్మీర్ ఫైల్స్’ దర్శకుల కాంబో.. సుకుమార్ (Sukumar), వివేక్ (Vivek Agnihotri) కలయికలో భారీ చిత్రం!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!