Jabardasth: జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ హైప‌ర్ ఆది గురించి ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన అదిరే అభి!

Updated on May 26, 2022 04:34 PM IST
హైప‌ర్ ఆది, అదిరే అభి (Hyper Adi, Adire Abhi)
హైప‌ర్ ఆది, అదిరే అభి (Hyper Adi, Adire Abhi)

బుల్లితెర‌పై ఈటీవీ లో ప్ర‌సార‌మ‌య్యే జబర్దస్త్ (Jabardasth) కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్లలో అదిరే అభి ఒకరు. గత 16 ఏళ్లకు పైగా టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్న అభికి సినిమాల ద్వారా అంతగా క్రేజ్ అయితే రాలేదు. కానీ, ఎప్పుడైతే టెలివిజన్ రంగంలోకి అరంగ్రేటం చేశాడో అప్పుడు మంచి గుర్తింపు లభించింది. అయితే, జబర్దస్త్ ద్వారా సక్సెస్ అయిన అదిరే అభి మరి కొంతమంది క‌మెడియ‌న్ల‌కు కూడా మంచి అవకాశాలను ఇస్తూ వ‌చ్చాడు. ఆయ‌న‌ ద్వారా సక్సెస్ అయిన వారిలో జ‌బ‌ర్ద‌స్త్ లో స్టార్ క‌మెడియ‌న్ హైపర్ ఆది కూడా ఉన్నాడు. హైప‌ర్ ఆది (Hyper Adi) కెరీర్ స్టార్ట్ చేసిన తొలినాళ్ల‌లో అదిరే అభి టీమ్ లోనే చేసేవాడు. 

కానీ, ఆ త‌ర్వాత ఆది.. అభి (Adire Abhi) టీమ్ నుంచి బ‌య‌ట‌కి వ‌చ్చి సొంతంగా మ‌రో టీమ్ ఏర్పాటు చేశాడు. ఈ నేప‌థ్యంలో వీరు విడిపోవడానికి గల కారణం పై అభి ఇటీవల ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. ఆది నా గ్రూప్ నుంచి బయటకు వెళ్లి మరో గ్రూపు పెట్టడానికి విభేదాలు ఏమీ కారణం కాదని అభిప్రాయ‌ప‌డ్డాడు. జబర్దస్త్ దర్శకులు మరో గ్రూప్ కావాలని ఆదిని సంప్రదించారు. నేను కూడా అతనికి ఆ సమయంలో ఫుల్ సపోర్ట్ చేశాను అని అన్నాడు. నా దగ్గర పనిచేసే వాళ్ళు ఎదిగితే అంతకంటే సంతోషం మరొకటి ఉండదు. అంతే కాకుండా అతను సొంత టాలెంట్ తోనే ఇంతవరకు వచ్చాడు.. తాను చేసింది కేవలం కొంత సహాయం మాత్రమే అని అభి వివరణ ఇచ్చాడు. అతను మొదట తనను ఫేస్ బుక్ ద్వారా కాంటాక్ట్ అయ్యాడని.. షార్ట్ ఫిలిం చూసి ఒకసారి తన దగ్గరకు రమ్మని చెప్పినట్లుగా ఆది వివరణ ఇచ్చాడు. మేము, టీమ్ తో క‌లిసి ప్రతి రోజు స్కిట్ చేస్తుంటే మధ్యలో వచ్చి తనదైన శైలిలో కొన్ని సలహాలు ఇస్తూ ఉండేవాడు. ఆ తర్వాత అతని పనితనం నచ్చి స్క్రిప్ట్ రైటర్ కూడా పెట్టుకున్నట్లు తెలియజేశాడు. దీంతో ప్రతి రోజు అలా స్క్రిప్టు అద్భుతంగా రాస్తూ ఉండటంతో అతన్ని ఎందుకు ఖాళీగా ఉంచాలి అని మా టీంలో ఒక కమెడియన్ గా చేర్చుకున్నట్లు అభి వివరణ ఇచ్చాడు. కాగా, మొదట అభి గ్రూప్ లోనే కొనసాగుతూ వచ్చిన హైపర్ ఆది స్క్రిప్ట్ రైటర్ గా కూడా కొన్నాళ్ళు వర్క్ చేశాడు. 

ఇక‌, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అభి (Adire Abhi) కొన్నాళ్ళు సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేశాడు. అయితే అది అంతగా నచ్చక‌పోవ‌డంతో మళ్ళీ తనకు ఇష్టమైన సినీరంగంలో సత్తా చాటాలని అనుకున్నాడు. ఈ ప్రయత్నంలో భాగంగానే అతనికి టెలివిజన్ నుంచి కొన్ని ఆఫర్లు వచ్చాయి. అప్ప‌ట్లో కొన్ని డాన్స్ షోలలో కూడా కంటెస్టెంట్ గా కూడా పార్టిసిపేట్ చేశాడు. అందులో భాగంగా ఈటీవీలో అదుర్స్ అనే షో చేస్తున్న సమయంలోనే అతనికి జబర్దస్త్ లో అవకాశం లభించింది.

కాగా, అదిరే అభి.. యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్ (Prabhas) మొద‌టి సినిమా ఈశ్వర్ లో హీరో ఫ్రెండ్స్ లో ఒకటిగా కనిపించిన విషయం తెలిసిందే. అంతే కాకుండా అభి బాహుబలి సినిమాకు సహాయ దర్శకుడిగా కూడా పనిచేశాడు. ఆ సినిమా ఫస్ట్ పార్ట్ షూటింగ్ సమయంలో అతను ప్రభాస్ తో కూడా చాలా క్లోజ్ గా తిరిగేవాడు. అంతేకాకుండా సినిమాలో మ‌రో న‌టుడు సుబ్బారాజుతో కలిసి ఒక చిన్న సన్నివేశంలో కూడా నటించిన విషయం తెలిసిందే. అయితే అదిరే అభి జబర్దస్త్ షో ద్వారా మంచి సక్సెస్ అందుకున్న అనంతరం కొత్తవారికి చాలానే అవకాశాలు ఇచ్చాడని చెప్పవ‌చ్చు. అంతేకాకుండా చిత్ర పరిశ్రమలో అవకాశాలు లేకుండా ఉన్న మరికొంత‌మంది తోటి న‌టుల‌కు కూడా తన స్కిట్ లో నటించే అవకాశం ఇచ్చాడు. ఆ విషయంలో అభికి చాలామంది నుంచి ప్రశంసలు ద‌క్కాయి. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!