Wanted Pandugod: 'వాంటెడ్ పండుగాడ్' నుంచి రాఘవేంద్రరావు స్టైల్ లో 'అబ్బా అబ్బా' లిరిక‌ల్ సాంగ్‌ రిలీజ్..!

Updated on Jul 31, 2022 07:40 PM IST
‘వాంటెడ్ పండుగాడ్’ సినిమా నుంచి 'అబ్బా అబ్బా అబ్బ‌బ్బ' (Abba Abba lyrical song) అనే లిరిక‌ల్ సాంగ్‌ రిలీజ్ చేశారు మేకర్స్. 
‘వాంటెడ్ పండుగాడ్’ సినిమా నుంచి 'అబ్బా అబ్బా అబ్బ‌బ్బ' (Abba Abba lyrical song) అనే లిరిక‌ల్ సాంగ్‌ రిలీజ్ చేశారు మేకర్స్. 

Wanted Pandugod: టాలీవుడ్ దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) హీరోగా ‘వాంటెడ్ పండుగాడ్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘పట్టుకుంటే కోటి’ అనేది ఈ సినిమా టైటిల్ ట్యాగ్ లైన్. యునైటెడ్ కె ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సాయిబాబ కోవెల మూడి, వెంక‌ట్ కోవెల మూడి నిర్మాతలుగా ఈ చిత్రం రూపొందుతోంది.

శ్రీధర్ సీపాన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దీపికా పిల్లి (Deepika Pilli), యాంకర్ విష్ణుప్రియ, అనసూయ భరద్వాజ్ (Anchor Anasuya), సునీల్, వెన్నెల కిషోర్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

‘వాంటెడ్ పండుగాడ్’ సినిమా పూర్తి వినోదాత్మక చిత్రంగా రూపొందుతోంది. కాగా, ఈ చిత్రం ఆగష్టు 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా 'అబ్బా అబ్బా అబ్బ‌బ్బ' (Abba Abba lyrical song) అనే లిరిక‌ల్ సాంగ్‌ రిలీజ్ చేశారు మేకర్స్. 

రాఘవేంద్రరావు తన సినిమాల్లో హీరోయిన్లను అందంగా చూపిస్తూ ఆకర్షణీయంగా పాటలు చిత్రీకరిస్తుంటారు. ఆయన చిత్రీకరించిన ఎన్నో పాటలు ఎవర్‌గ్రీన్‌గా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయాయి. ‘అబ్బా అబ్బా అబ్బబ్బ’ పాట కూడా కలర్‌ఫుల్‌గా ఉంది. 

ఈ పాటలో సుడిగాలి సుధీర్, స‌ప్త‌గిరి, శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిషోర్‌ (Vennela Kishore), దీపికా పిల్లి, నిత్యాశెట్టి, విష్ణుప్రియ‌ (Vishnu Priya), వాసంతి జోడిలుగా కనిపించారు. హీరోయిన్స్‌ అందాలను దర్శకేంద్రుడి స్టైల్ లో క్యాచీగా చూపించారు మేకర్స్. ఈ పాటను హారిక నారాయణ్, శ్రీకృష్ణ ఆలపించారు. పి.ఆర్ సంగీతం అందిస్తూ పాట‌కు సాహిత్యాన్ని అందించారు. 

Read More: కె.రాఘవేంద్రరావు సమర్పణలో.. సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) హీరో ! సినిమా పేరు 'వాంటెడ్ పండుగాడ్'

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!