ఎంఎస్ ధోని (Mahendra Singh Dhoni) నిర్మాతగా ఇళయదళపతి విజయ్ (Vijay) కొత్త చిత్రం!

Updated on Oct 14, 2022 11:19 AM IST
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay)తో ఓ చిత్రాన్ని తీసేందుకు టీమిండియా మాజీ కెప్టెన్ ధోని (Mahendra Singh Dhoni) ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay)తో ఓ చిత్రాన్ని తీసేందుకు టీమిండియా మాజీ కెప్టెన్ ధోని (Mahendra Singh Dhoni) ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం

ఒంటిచేత్తో భారత క్రికెట్ జట్టుకు తిరుగులేని ఎన్నో విజయాలను అందించిన సారథిగా మహేంద్ర సింగ్ ధోనీని (Mahendra Singh Dhoni) చెప్పుకోవచ్చు. ఎన్నాళ్లుగానో ఊరిస్తున్న వన్డే వరల్డ్ కప్‌తోపాటు టీ20 ప్రపంచ కప్‌ను జట్టుకు అందించారు ధోని. అలాగే టెస్టుల్లోనూ ఇండియాను నంబర్ వన్ జట్టుగా నిలిపారు. ఇక, క్రికెట్ నుంచి సన్యాసం తీసుకున్నాక.. కేవలం ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడుతున్నారు. అయితే, ప్రస్తుతం ఆయన సినిమాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నారని తెలుస్తోంది. 

దక్షిణాది చిత్ర పరిశ్రమలోకి ధోని అడుగుపెట్టనున్నట్లు వినికిడి. ఎంఎస్ ధోని ఎంటర్‌టైన్‌మెంట్స్ అనే సంస్థను స్థాపించి ఇప్పటికే మూడు సినిమాలను నిర్మించిన ఆయన.. ఈసారి సౌత్‌లో బడా స్టార్‌తో భారీ చిత్రాన్ని రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఆ స్టార్ మరెవరో కాదు.. ఇళయదళపతి విజయ్ (Vijay) అని సమాచారం. విజయ్ 70వ చిత్రానికి ధోని నిర్మాతగా వ్యవహరించనున్నారని కోలీవుడ్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 

దీపావళి పండుగ రోజున విజయ్‌తో ధోని తీయబోయే సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తారని మీడియాలో కథనాలు వస్తున్నాయి. మరి, ఈ ప్రాజెక్టు కార్యరూపం దాలుస్తుందో లేదో చూడాలి. కాగా, ‘రోర్‌‌ ఆఫ్‌ ది లయన్’, ‘బ్లేజ్‌ టు గ్లోరీ’, ‘ది హిడెన్ హిందూ’ వంటి చిన్న సినిమాలను ధోని తన బ్యానర్‌‌లో నిర్మించారు. ఒకవేళ విజయ్‌తో సినిమా కన్ఫర్మ్ అయితే మాత్రం సౌత్ బడా నిర్మాతల లిస్టులో ఈ డాషింగ్ బ్యాట్స్‌మన్ కూడా చేరినట్లేనని చెప్పొచ్చు. 

ఇకపోతే, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం ‘వరిసు’ (Varisu) అనే చిత్రంలో నటిస్తున్నారు. టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) దీన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగులో ఈ సినిమాను ‘వారసుడు’ (Vaarasudu)గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయ్యిందని సమాచారం. కుటుంబ ప్రేక్షకులు మెచ్చేలా.. కొత్తదనం నిండిన కథతో ఈ మూవీ రూపొందుతోందని తెలిసింది. ఈమధ్య కాలంలో విజయ్ సినిమాలు తెలుగు నాట కూడా మంచి వసూళ్లు సాధించిన నేపథ్యంలో.. ‘వారసుడు’పై ఇక్కడా భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది.  

Read more: విజయ్ (Vijay) ‘వారసుడు’ (Vaarasudu) రిలీజ్ డేట్ ఫిక్స్!. ‘ఆదిపురుష్’ (Adipurush)తో పోటీ తప్పదా?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!