Thalapathy Vijay (దళపతి విజయ్) : టాలీవుడ్‌‌కి 'వారసుడు'గా తమిళ హీరో.. ఫస్ట్ లుక్ క్లాస్, సెకండ్ లుక్ మాస్ !

Updated on Jun 22, 2022 03:04 PM IST
ద‌ళ‌ప‌తి విజ‌య్ (Vijay) పుట్టిన రోజు జూన్ 22. విజ‌య్ బ‌ర్త్  డే సంద‌ర్భంగా 'వార‌సుడు' సెకండ్ లుక్  రిలీజ్ చేశారు.
ద‌ళ‌ప‌తి విజ‌య్ (Vijay) పుట్టిన రోజు జూన్ 22. విజ‌య్ బ‌ర్త్  డే సంద‌ర్భంగా 'వార‌సుడు' సెకండ్ లుక్ రిలీజ్ చేశారు.

ద‌ళ‌ప‌తి విజ‌య్ (Vijay) హీరోగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిస్తున్న సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారు. అధికారికంగా ఈ సినిమాకు 'వార‌సుడు' అనే టైటిల్ ఖ‌రారు చేశారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ బ్యానర్ల‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'వార‌సుడు' సినిమాకు దిల్ రాజు, ప‌ర‌మ్ వి పొట్లూరి నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. విజ‌య్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా 'వార‌సుడు' సినిమాకు సంబంధించి తెలుగుతో పాటు త‌మిళ్ వ‌ర్ష‌న్ సెకండ్ లుక్ విడుద‌ల చేశారు. 

వార‌సుడు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్
ద‌ళ‌ప‌తి విజ‌య్ (Vijay) పుట్టిన రోజు జూన్ 22. విజ‌య్ బ‌ర్త్  డే సంద‌ర్భంగా ఓ రోజు ముంద‌గానే 'వార‌సుడు' ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేశారు. విజ‌య్ చాలా స్టైలిష్ లుక్‌లో ఆ పోస్ట‌ర్‌లో క‌నిపించారు. ఈ చిత్రంలో ది బాస్ రిటర్న్స్ అనే ట్యాగ్ లైన్ అందరికీ ఆస‌క్తిని క‌లిగిస్తోంది. మరి ఎవ‌రి వార‌సుడిగా విజ‌య్ ఈ సినిమాలో క‌న‌బ‌డ‌తారో చూడాలి. ఈ సినిమాను పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు. 

తెలుగులో ఫ‌స్ట్ టైం న‌టిస్తున్న విజ‌య్
తెలుగుతో పాటు త‌మిళ భాష‌లో కూడా ఈ సినిమా తెరకెక్కుతోంది.  'వారిసు' అనే టైటిల్‌తో ఈ చిత్రం తమిళంలో రిలీజ్ అవుతోంది. తెలుగులో మొద‌టిసారి విజ‌య్ న‌టిస్తున్న సినిమా 'వార‌సుడు'. వంశీ పైడిప‌ల్లి స‌రికొత్త క‌థ‌తో ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. వార‌సుడు చిత్రంలో విజ‌య్‌కు జోడిగా ర‌ష్మిక మంద‌న న‌టించ‌నున్నారు. ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, శామ్, యోగి బాబు, సంగీతలు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. 

ద‌ళ‌ప‌తి విజ‌య్ (Vijay) పుట్టిన రోజు జూన్ 22. విజ‌య్ బ‌ర్త్  డే సంద‌ర్భంగా ఓ రోజు ముంద‌గానే వార‌సుడు ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేశారు.

సెకండ్ పోస్ట‌ర్‌లో మాస్ లుక్‌లో విజ‌య్
ద‌ళ‌ప‌తి విజ‌య్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా  శ్రీ వేంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ నిర్మాణ సంస్థ మ‌రో పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసింది. 'వార‌సుడు' సినిమాకు సంబంధించి తెలుగుతో పాటు త‌మిళంలో, ఈ సెకండ్ లుక్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసింది. విజ‌య్ ఫ‌స్ట్ లుక్‌లో క్లాస్‌గా, ఓ బిజినెస్ మ్యాన్‌గా క‌నిపించారు. సూటు.. బూటులో 'వావ్' అనిపించారు.

కానీ సెకండ్ పోస్ట‌ర్‌లో మాత్రం పూర్తిగా మాస్ లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చారు. హీరో విజ‌య్ చిన్నారుల‌తో క‌లిసి ఓ కూర‌గాయ‌ల మార్కెట్‌లో ఉన్న బొమ్మను సెకండ్ పోస్టర్‌గా రిలీజ్ చేశారు. కొత్త పోస్ట‌ర్ చూసిన విజ‌య్ ఫ్యాన్స్ 'అద‌ర‌హో విజ్జు'  అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

చెన్నైలో 'వార‌సుడు' చిత్రం మొద‌టి షూటింగ్ షెడ్యూల్ జ‌రుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి చెన్నైలో ప‌లు కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లితో పాటు హరి, అహిషోర్‌ సాల్మన్‌ కథ, స్క్రీన్ ప్లేను అందించారు. త‌మ‌న్ అందించే సంగీతం ఈ చిత్రానికి ప్ల‌స్ కానుంది. విజ‌య్ న‌టిస్తున్న 'వార‌సుడు' సినిమా 2023లో సంక్రాంతికి విడుద‌ల చేయ‌నున్నారు.

Read More: విజయ్ (Vijay), లోకేష్‌ కనగరాజ్‌ కాంబో రిపీట్: 'మాస్టర్‌‌' రేంజ్‌ చిత్రం కోసం ఫ్యాన్స్ వెయిటింగ్ ! 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!