దక్షిణాది సినిమాలపై టీమిండియా మాజీ కెప్టెన్ ధోని (MS Dhoni) ఫోకస్.. ధోని ఎంటర్‌టైన్‌మెంట్ సంస్ధ ఏర్పాటు?
భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) సౌత్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నట్టు తెలుస్తోంది. ఎంఎస్ ధోని ఎంటర్‌టైన్‌మెంట్ అనే సంస్థను స్థాపించి ఇప్పటికే మూడు సినిమాలను నిర్మించారు. రోర్ ఆఫ్ ది లయన్, బ్లేజ్ టు గ్లోరీ, ది హిడెన్ హిందూ వంటి చిన్న సినిమాలను ఈ బ్యానర్‌లో నిర్మించారు ధోని. క్రికెట్‌లోకి అడుగుపెట్టి కోట్ల మంది కలలను నెరవేర్చారు ధోని. అన్ని ఫార్మాట్‌లలోనూ ఇండియాన్ టీమ్‌ను నంబర్ వన్‌గా నిలిపారు.
తాజాగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ.. తన దృష్టిని సినిమా నిర్మాణంపై పెట్టినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎంఎస్ ధోని ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ పేరుతో సినిమాలు నిర్మించారు. ఇప్పుడు ధోనీ దృష్టి సౌత్ సినిమాలపై పడింది. ఈ క్రమంలోనే ధోని ఎంటర్‌టైన్‌మెంట్ అనే సంస్థను స్థాపించి తమిళ్, తెలుగు, మలయాళ భాషల్లో సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఫుల్ క్లారిటీ వచ్చేది అప్పుడే..
ధోని ఎంటర్‌టైన్‌మెంట్ (Dhoni Entertainment) బ్యానర్‌పై ఎటువంటి సినిమాలను తెరకెక్కించనున్నారు, ఎవరితో నిర్మిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. క్రికెట్ చరిత్రలో వన్ ఆఫ్ ది లెజెండ్ అయిన ధోనీతో చేతులు కలిపే నటీనటులు ఎవరు అనే విషయంపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. ఇవన్నీ తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే మరి. ఏది ఏమైనా దక్షిణాది భాషల్లో సినిమాలు తీయాలనే ఆలోచన ధోనీకి రావడంతో ఆయన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్ ఫార్మాట్ల నుంచి రిటైర్ అయ్యారు ధోని. కానీ ఇప్పటికీ ఐపీఎల్ ఫ్రాంచైజీల్లో ఒక్కటైన చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా ఉన్నారు ఈ జార్ఖండ్ డైనమైట్. క్రికెట్ చరిత్రలో 50 ఓవర్ల ప్రపంచ కప్, టీ20 ప్రపంచకప్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ... మూడు ప్రధాన ఐసీసీ ట్రోఫీలను గెలుచుకున్న ఏకైక కెప్టెన్‌గా ధోని (MS Dhoni) నిలిచారు.
Read More : రచయిత నుంచి దర్శకుడిగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) 20 ఏళ్ల సినీ ప్రయాణం!