లీడర్ సినిమా సీక్వెల్‌లో మహేష్‌బాబు (MaheshBabu) నటించనున్నారా? శేఖర్ కమ్ముల కథకు సూపర్‌‌స్టార్ ఓకే చెబుతారా!

Updated on Aug 16, 2022 10:25 PM IST
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లీడర్‌‌ సినిమా సీక్వెల్‌లో మహేష్‌బాబు (MaheshBabu) నటించనున్నారని టాక్
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లీడర్‌‌ సినిమా సీక్వెల్‌లో మహేష్‌బాబు (MaheshBabu) నటించనున్నారని టాక్

మహేష్‌బాబు (MaheshBabu) ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. సినిమా సినిమాకు మహేష్  క్రేజ్ పెరుగుతోంది. ప్రస్తుతం మహేష్‌బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత రాజమౌళి డైరెక్షన్‌లో ఒక సినిమా చేయడానికి ఓకే  చెప్పారు.

ఈ రెండు సినిమాలను పూర్తి చేయడానికి మహేష్‌బాబు కనీసం మూడు సంవత్సరాల సమయం తీసుకుంటారు. అయితే ఈ రెండు సినిమాల తర్వాత మహేష్ ‘లీడర్’ సినిమా సీక్వెల్‌లో నటించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దగ్గుబాటి రానా హీరోగా తెరకెక్కిన లీడర్ సినిమా అప్పట్లో భారీ హిట్‌ సాధించింది. లీడర్‌‌ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించాలని శేఖర్ కమ్ముల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే లీడర్ సీక్వెల్‌ను రానాతో కాకుండా మహేష్‌బాబుతో తెరకెక్కించాలని భావిస్తున్నారట శేఖర్ కమ్ముల. చాలా రోజుల క్రితమే లీడర్ సీక్వెల్‌ కథను మహేష్‌కు శేఖర్‌‌ కమ్ముల వినిపించారని టాక్.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లీడర్‌‌ సినిమా సీక్వెల్‌లో మహేష్‌బాబు (MaheshBabu) నటించనున్నారని టాక్

చర్చలు ఇప్పటికే జరిగాయని..

లీడర్ మూవీ సీక్వెల్‌కు సంబంధించి గతంలోనే చర్చలు జరిగాయని చెప్పుకొచ్చారు ఏవీఎం నిర్మాణ సంస్థకు చెందిన అరుణ గుహన్. భవిష్యత్తులో ఈ ప్రాజెక్ట్ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందన్నారు కూడా.

మహేష్‌బాబు ఇప్పటికే కొరటాల శివ డైరెక్షన్‌లో భరత్ అనే నేను సినిమాలో నటించారు. లీడర్ సీక్వెల్‌లో మహేష్ నటిస్తే కచ్చితంగా ఆ సినిమాతో పోల్చి చూసే ఛాన్స్ ఉంటుందని టాక్. మహేష్ (MaheshBabu) ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారనే విషయం తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.

Read More : మహేష్‌బాబు (MaheshBabu) – త్రివిక్రమ్ సినిమాలో కీలక పాత్రలో మోహన్‌బాబు, శోభన? త్వరలో అధికారిక ప్రకటన!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!