మహేష్‌బాబు (MaheshBabu) – త్రివిక్రమ్ సినిమాలో కీలక పాత్రలో మోహన్‌బాబు, శోభన? త్వరలో అధికారిక ప్రకటన!

Updated on Jun 22, 2022 10:40 PM IST
మహేష్‌బాబు, మోహన్‌బాబు, శోభన
మహేష్‌బాబు, మోహన్‌బాబు, శోభన

సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట సినిమా విజయాలతో మంచి జోష్‌లో ఉన్నారు సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu). ప్రస్తుతం మహేష్‌ ఫ్యామిలీతో విదేశాల్లో ఉన్నారని సమాచారం. విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత మహేష్‌.. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో వచ్చే మూడో సినిమా కోసం ప్రిన్స్ అభిమానులతోపాటు, సినీ ప్రేమికులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మహేష్‌బాబు – త్రివిక్రమ్ కాంబోలో వచ్చే సినిమాపై రోజుకో వార్త హల్‌చల్‌ చేస్తోంది. జూలై నెలాఖరు నుంచి సినిమా షూటింగ్ మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు ‘పార్ధు’, ‘అర్జునుడు’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. కాగా ఈ సినిమా గురించిన మరో ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది.

మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్​లో గతంలో అతడు,  ఖలేజా  సినిమాలు వచ్చి ప్రేక్షకులను అలరించాయి. పదకొండు సంవత్సరాల తరువాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్. ఎన్టీఆర్‌తో ‘అరవింద సమేత’, అల్లు అర్జున్ తో ‘అల వైకుంఠపురములో’ వంటి వరుస హిట్ సినిమాలను తెరకెక్కించిన త్రివిక్రమ్.. మంచి జోష్‌తో మహేష్‌ సినిమాను రూపొందిస్తున్నారు. హారికా హాసినీ బ్యానర్‌పై నిర్మించనున్న ఈ సినిమా హీరోగా మహేష్ బాబుకు 28వ సినిమా. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

శ్రీలీల, త్రివిక్రమ్, మహేష్‌బాబు, పూజా హెగ్డే

మహేష్‌తో సీన్స్‌ అదిరిపోతాయని టాక్..

ఇక, ఈ సినిమాలో మోహన్ బాబు కూడా నటించబోతున్నారని తెలుస్తోంది. మహేష్ బాబుకు అంకుల్ క్యారెక్టర్‌‌లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ కారెక్టర్‌‌ను త్రివిక్రమ్ విభిన్నంగా డిజైన్ చేస్తున్నాడని సమాచారం. మహేష్, మోహన్ బాబు మధ్య జరిగే సన్నివేశాలు చాలా బాగుంటాయని నమ్మకంగా చెప్తున్నారు యూనిట్.

ఈ సినిమాలో మోహన్ బాబు నటించనున్నారనే సంగతి త్వరలోనే యూనిట్ నుంచి రాబోతోందని టాక్. అంతేకాదు ఈ సినిమాలో అలనాటి అగ్ర హీరోయిన్ శోభన కూడా మరో కీలక పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. నదియా, ఖుష్బూ వంటి సీనియర్‌‌ హీరోయిన్స్‌ను టాలీవుడ్‌లోకి మరోసారి తీసుకొచ్చారు త్రివిక్రమ్. అలాగే శోభనను కూడా త్రివిక్రమ్ – మహేష్‌బాబు (MaheshBabu) కాంబోలో రాబోయే ఈ సినిమాలో కీలకపాత్ర కోసం శోభనను అంగీకరించేలా చేసినట్టు తెలుస్తోంది.

Read More : ఆ హీరోయిన్లు వద్దంటూ రాజమౌళికి షరతులు పెట్టిన మహేష్‌బాబు (MaheshBabu).. నిజమెంత?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!