మహేష్‌బాబు (MaheshBabu) – రాజమౌళి కాంబో సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్.. అడ్వంచరస్ థ్రిల్లర్‌‌గా మూవీ

Updated on Jun 29, 2022 09:21 PM IST
దర్శకధీరుడు రాజమౌళి, సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు
దర్శకధీరుడు రాజమౌళి, సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు

సర్కారు వారి పాట సినిమా హిట్‌ కావడంతో మంచి జోష్‌ మీద ఉన్నారు సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu). ఆ సినిమా విజయంతో తర్వాతి సినిమాను పట్టాలెక్కించేశారు ప్రిన్స్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దర్శకత్వంలో సినిమాకు ఓకే చెప్పేశాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్‌ శరవేగంగా జరుగుతున్నాయి. జూలై నెలాఖరు నుంచి మహేష్‌–త్రివిక్రమ్ కాంబో సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.

ఇక ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమాతో దర్శక ధీరుడు రాజమౌళి మరో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమా విడుదలైన అన్ని భాషలు, అన్ని సెంటర్లలో సూపర్‌‌హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.1,100 కోట్లు వసూలు చేసి రికార్డులు సృష్టించింది. థియేటర్లలోనే కాకుండా ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమా ఓటీటీలో కూడా రికార్డులు సృష్టించింది.

ఈ క్రమంలో రాజమౌళి తర్వాత సినిమా ఏ హీరోతో తెరకెక్కించబోతున్నారు? హీరో ఎవరు? ఏ జోనర్‌‌ సినిమా? ఎప్పుడు సెట్స్‌పైకి వెళుతుంది? సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అనే ప్రశ్నలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఈ ప్రశ్నల్లో కొన్నింటికి సమాధానం దొరికింది.

దర్శకుడు రాజమౌళి చేసిన ట్వీట్

ఆఫ్రికల్ అడవుల్లో అడ్వంచరస్‌గా..

రాజమౌళి తర్వాతి సినిమా సూపర్‌‌స్టార్ మహేష్‌బాబుతో తెరకెక్కించనున్నారని వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని దర్శకుడు, హీరో మహేష్‌ కూడా అంగీకరించారు. SSMB29 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కబోయే ఈ సినిమా అడ్వంచరస్ థ్రిల్లర్‌‌ అని తెలుస్తోంది. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో కథ సాగుతుందని సమాచారం.

మహేష్‌ – రాజమౌళి కాంబినేషన్‌లో రాబోయే సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన అప్‌డేట్‌ను అందించాడు దర్శకుడు రాజమౌళి. ఇటీవల ఒక మీడియా ఇంటరాక్షన్‌లో పలు విషయాలను వెల్లడించాడు జక్కన్న. మూడు సంవత్సరాల పాటు ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు చెప్పాడు రాజమౌళి. ఈ సినిమా మేకింగ్‌ కోసం ఫ్రాన్స్‌ బేస్డ్‌ త్రీడీ యానిమేషన్, వీఎఫ్‌ఎక్స్‌ స్టూడియోస్‌ను కూడా సంప్రదించాడట. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడానికి ఆయా కంపెనీలతో కలిసి పనిచేయనున్నట్టు తెలిపాడు దర్శక ధీరుడు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు రాజమౌళి. ఈ ట్వీట్‌కు ఒక ఫోటోను కూడా ట్యాగ్ చేశాడు జక్కన్న. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు, మాటల మాంత్రికుడు దర్శకుడు త్రివిక్రమ్

భారీ బడ్జెట్‌తో..

రాజమౌళి ఇప్పటివరకూ తీసిన సినిమాల బడ్జెట్ కంటే కూడా మహేష్‌బాబు సినిమాకు భారీగా ఖర్చుపెట్టబోతున్నారని సమాచారం. అడ్వంచరస్ యాక్షన్ థ్రిల్లర్‌‌కు భారీ బడ్జెట్ పెడుతున్నారంటే.. ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని సూపర్‌‌స్టార్‌‌ అభిమానులు అనుకుంటున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్‌పై రాజమౌళి అండ్ టీమ్ బిజీగా ఉంది. అయితే ఈ సినిమా కోసం మహేష్‌బాబు (MaheshBabu) మూడు సంవత్సరాలు డేట్స్‌ ఇస్తుండడం అభిమానుల్ని కొంచెం నిరాశపరుస్తోంది. వచ్చే ఏడాది వేసవిలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమాతో రాజమౌళి చిత్రం ఎంత భారీ సక్సెస్‌ అందుకుంటాడో చూడాలి.

Read More : క్యారెక్టర్‌‌ నచ్చితే మళ్లీ విలన్‌గా చేస్తా.. ఎంజాయ్ చేస్తూ ‘పక్కా కమర్షియల్’ చేశా : గోపీచంద్ (Gopichand)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!