మహేష్‌బాబు (MaheshBabu) – త్రివిక్రమ్‌ సినిమా షూటింగ్‌ వాయిదా! వారం రోజులు పోస్ట్‌పోన్ అయ్యిందని టాక్

Updated on Sep 10, 2022 06:00 PM IST
మహేష్‌బాబు (MaheshBabu) - త్రివిక్రమ్‌ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయనున్నారు మహేష్
మహేష్‌బాబు (MaheshBabu) - త్రివిక్రమ్‌ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయనున్నారు మహేష్

సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu) సినిమా సర్కారు వారి పాట రిలీజై మూడు నెలలు దాటింది. ఇప్పటివరకు తర్వాత సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేయలేదు మహేష్. సర్కారు వారి పాట సినిమా విడుదలై హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో మహేష్‌.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ శ్రీనివాస్‌తో సినిమా చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అలాగే త్రివిక్రమ్‌తో సినిమా తర్వాత దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా చేయనున్నారు మహేష్‌.

టాలీవుడ్‌ ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కాంబినేషన్‌ సినిమాలలో మహేష్‌బాబు – త్రివిక్రమ్‌ కాంబో కూడా ఒకటి. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు క్లాసికల్‌ మూవీస్‌గా నిలిచాయి.

అతడు, ఖలేజా సినిమాలు విడుదలై దాదాపుగా 10 సంవత్సరాలకు పైనే అయ్యింది. అయినా ఇప్పటికీ ఆ సినిమాలు టీవీలో ప్రసారమైతే.. వ్యూయర్‌‌షిప్‌ లక్షల్లో ఉంటుంది. ఇక, మహేష్‌ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా రాబోతోంది అని ప్రకటించినప్పటి నుంచే సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

మహేష్‌బాబు (MaheshBabu) - త్రివిక్రమ్‌ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయనున్నారు మహేష్

జిమ్‌ వీడియో..

వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కనుందని ఈ ఏడాది ప్రథమార్ధంలోనే ప్రకటన వచ్చినా షూటింగ్ మాత్రం మొదలు కాలేదు. త్రివిక్రమ్‌ సినిమా కోసం ప్రిన్స్‌ జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోను మహేష్‌ (MaheshBabu)  భార్య ఇటీవలే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. షూటింగ్‌ కూడా త్వరలోనే మొదలు కానుందని తెలిపారు. దీంతో ప్రిన్స్ అభిమానులు ఎంతో సంతోషించారు. ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తయిన ఈ సినిమా ఎస్‌ఎస్‌ఎంబీ28 వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కనుంది.

అయితే సినిమా షూటింగ్‌ వాయిదా పడినట్టు తెలుస్తోంది. షూటింగ్‌ పనులు పూర్తికాకపోవడంతో చిత్ర యూనిట్ కొద్ది రోజులు షూటింగ్‌ పోస్ట్‌పోన్‌ చేసిందని సమాచారం. ఎస్‌ఎస్‌ఎంబీ28లో మ‌హేష్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించ‌నున్నారు. హారిక అండ్ హాసినీ క్రియేష‌న్స్ బ్యానర్‌‌పై ఎస్‌.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఎస్‌ఎస్ థ‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 28న విడుద‌ల చేయ‌నున్నట్లు మేక‌ర్స్ ఇప్పటికే ప్రక‌టించారు. తెలుగు, త‌మిళం, హిందీ, క‌న్నడ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో మహేష్‌బాబు (MaheshBabu) హీరోగా నటిస్తున్న ఎస్‌ఎస్‌ఎంబీ28 సినిమాను విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నార‌ని సమాచారం.

Read More : మహేష్‌బాబు (MaheshBabu) – రాజమౌళి సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌‌ రణ్​బీర్ కపూర్‌‌ నటించనున్నారా?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!