మహేష్‌బాబు (MaheshBabu) – రాజమౌళి సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌‌ రణ్​బీర్ కపూర్‌‌ నటించనున్నారా?

Updated on Sep 06, 2022 08:54 PM IST
సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu) ప్రస్తుతం త్రివిక్రమ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు
సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu) ప్రస్తుతం త్రివిక్రమ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు

సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu) ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేయడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు మహేష్‌. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమా కోసం ప్రిన్స్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక, దర్శకుడు రాజమౌళి.. హిందీ సినిమా 'బ్రహ్మాస్త్ర' సినిమా తెలుగు వెర్షన్‌కి సమర్పకుడిగా ఉన్నారు. ఈ సినిమా కోసం రాజమౌళి, అతని టీం జోరుగా ప్రమోట్‌ చేస్తున్నారు. ఈ ప్రమోషన్స్‌ కోసం రణ్​బీర్‌ కపూర్‌ని కొంచెం తెలుగు నేర్చుకోమని రాజమౌళి సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆయన సలహాతోనే రణ్​బీర్‌, అతని భార్య అలియా ఇద్దరూ కొద్దికొద్దిగా తెలుగులో మాట్లాడుతున్నారు. అలియా అయితే తెలుగులో పాట కూడా పాడారు. గతంలో ఎప్పుడూ ఒక హిందీ సినిమాకు ఇంతగా ప్రచారం చెయ్యలేదు. కానీ 'బ్రహ్మాస్త్ర' టీం మాత్రం తెలుగులో విపరీతంగా పబ్లిసిటీ చేస్తున్నది.

సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu) ప్రస్తుతం త్రివిక్రమ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు

షూటింగ్ వచ్చే సంవత్సరం..

'బిగ్‌ బాస్‌' వేదికపై రణబీర్‌, అలియాభట్‌ సందడి చేశారు. మరికొన్ని రియాలిటీ షోలకు కూడా హాజరయ్యారు. బ్రహ్మాస్త్ర సినిమా సెకండ్ పార్ట్‌ విడుదల సమయానికి పూర్తిగా తెలుగు నేర్చుకుంటానని చెప్పారు రణబీర్‌. అయితే రణబీర్‌ తెలుగు నేర్చుకోవడం వెనుక రాజమౌళి టీం ఉన్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్‌ హీరోతో తెలుగు మాట్లాడించడానికి రాజమౌళి ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే విషయంపై ఇండస్ట్రీలో చర్చ మొదలైంది.

రాజమౌళి తన తర్వాత సినిమాను మహేష్‌బాబుతో చేయనున్నారు. అందులో రణబీర్‌ను ఒక క్యారెక్టర్‌‌ కోసం సెలక్ట్‌ చేయనున్నట్టు తెలుస్తోంది. మహేష్‌బాబు – రాజమౌళి సినిమా షూటింగ్‌ వచ్చే ఏడాది మొదలవుతుంది. ఇంకా చాలా సమయం ఉండడంతో ట్యూటర్‌ని పెట్టి మరీ తెలుగు నేర్పిస్తున్నారట రాజమౌళి. దీని ప్రకారం రాజమౌళి తన తర్వాతి సినిమాలో, మహేష్‌బాబు (MaheshBabu)తోపాటు రణబీర్‌ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి.

Read More : మహేష్‌బాబు (MaheshBabu) – త్రివిక్రమ్ కాంబో సినిమాలో నటించడంపై హీరో తరుణ్ క్లారిటీ

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!