మహేష్‌బాబు (MaheshBabu) – త్రివిక్రమ్ కాంబో సినిమాలో నటించడంపై హీరో తరుణ్ క్లారిటీ

Updated on Aug 31, 2022 06:16 PM IST
సూపర్‌‌స్టార్‌‌ మహేష్‌బాబు (MaheshBabu) – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా వచ్చి 12 సంవత్సరాలు గడిచింది
సూపర్‌‌స్టార్‌‌ మహేష్‌బాబు (MaheshBabu) – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా వచ్చి 12 సంవత్సరాలు గడిచింది

సూపర్‌‌స్టార్‌‌ మహేష్‌బాబు (MaheshBabu) – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. మహేష్‌ – త్రివిక్రమ్ కాంబోలో సినిమా కోసం ప్రేక్షకులు చాలా సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు.

 కాగా, సర్కారు వారి పాట వంటి సూపర్ హిట్‌ సినిమా తర్వాత మహేష్, అల వైకుంఠపురములో సినిమా వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ముందు నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఎస్‌ఎస్‌ఎంబీ28 వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్‌‌ షూటింగ్‌ ఇంకా స్టార్ట్ కాలేదు. అయితే ఈ సినిమా పూజా కార్యక్రమాలు మాత్రం పూర్తయ్యాయి. ఈ సినిమాపై రోజులో వార్త ఇండస్ట్రీలో హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం హీరో తరుణ్‌ను చిత్ర యూనిట్ సంప్రదించిందని, తరుణ్‌ కూడా ఆ క్యారెక్టర్ చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారనే వార్తలు వచ్చాయి.

సూపర్‌‌స్టార్‌‌ మహేష్‌బాబు (MaheshBabu) – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా వచ్చి 12 సంవత్సరాలు గడిచింది

తప్పకుండా షేర్‌‌ చేస్తా..

 సినిమాలో తరుణ్‌ నటిస్తున్నారనే వార్తలు నిజం అనుకున్న నెటిజన్లు.. తరుణ్‌కు సోషల్‌ మీడియా ద్వారా ఆల్‌ ది బెస్ట్‌ చెబుతున్నారు. అయితే ఈ వార్తలపై తరుణ్‌ రీసెంట్‌గా క్లారిటీ ఇచ్చారు. ఎస్‌ఎస్‌ఎంబీ28 సినిమాలో నటించాలని ఎవరూ తనను సంప్రదించలేదని స్పష్టం చేశారు.

మహేష్‌ – త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో తాను నటించడం లేదని చెప్పారు తరుణ్. తనకు సంబంధించిన వార్తలు ఏమైనా ఉంటే అభిమానులతో తప్పకుండా పంచుకుంటానని అన్నారు.

బాలనటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తరుణ్.. నువ్వే కావాలి సినిమాతో హీరోగా మారారు. ఆ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ సాధించడంతో స్టార్ హీరోగా ఎదిగారు.

లవర్‌‌బాయ్‌ ఇమేజ్‌తో పలు సూపర్‌‌హిట్‌ సినిమాల్లో నటించి యూత్‌లో క్రేజ్‌ దక్కించుకున్నారు. అయితే ఆ తర్వాత సినిమాలకు దూరమై.. బిజినెస్‌ చేసుకుంటున్నారు తరుణ్‌. మహేష్‌బాబు (MaheshBabu) – త్రివిక్రమ్ సినిమా ద్వారా తమ అభిమాన హీరో రీఎంట్రీ ఇవ్వబోతున్నారని తరుణ్‌ అభిమానులు ఎంతో ఆనందించారు. అయితే అదేమీ లేదని తెలిసి కొంత నిరాశచెందారు. 

Read More : డాన్స్ షోలో సంద‌డి చేసిన మ‌హేష్ బాబు (Mahesh Babu), సితార‌.. ప్రిన్స్ లుక్ త్రివిక్ర‌మ్ సినిమా కోసమేనా!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!