ప్రభాస్ (Prabhas) అడిగితే ఏ క్యారెక్టర్ అయినా చేస్తాను: హీరో గోపీచంద్ (Gopichand)

Updated on Jun 24, 2022 05:37 PM IST
కొంచెం సిగ్గు పడే స్వభావం ఉండే గోపీచంద్‌కు టాలీవుడ్‌లో మంచి స్నేహితుడు ఎవరు అని అడిగితే మాత్రం ఏ మాత్రం ఆలోచించకుండా ప్రభాస్ అని చెప్పేస్తాడు.
కొంచెం సిగ్గు పడే స్వభావం ఉండే గోపీచంద్‌కు టాలీవుడ్‌లో మంచి స్నేహితుడు ఎవరు అని అడిగితే మాత్రం ఏ మాత్రం ఆలోచించకుండా ప్రభాస్ అని చెప్పేస్తాడు.

‘ఈశ్వర్’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas). తన మేనరిజం, యాక్టింగ్, బాడీ లాంగ్వేజ్‌తో కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు డార్లింగ్. రెబల్‌స్టార్ కృష్ణంరాజు  వారసుడుగా ఇండస్ట్రీలోకి వచ్చినా. ఎంతో కష్టపడి పాన్‌ ఇండియా స్టార్‌‌గా ఎదిగాడు ప్రభాస్.

అభిమానులు ముద్దుగా డార్లింగ్ అని పిలుచుకునే ప్రభాస్‌‌కు ఇండస్ట్రీలో క్లోజ్‌ ఫ్రెండ్ ఎవరు అంటే గోపీచంద్ అని ఠక్కున చెప్తాడు.‘తొలివలపు’ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చాడు గోపీచంద్. ఆ సినిమా మంచి పేరే తెచ్చిపెట్టినా.. ఎందుకోగానీ తర్వాత సినిమాల్లో ఆయనకు విలన్‌గా మాత్రమే అవకాశాలు వచ్చాయి.

వర్షం, నిజం, జయం సినిమాల్లో గోపీచంద్ విలన్‌గా నటించి మెప్పించాడు. తర్వాత మళ్లీ హీరోగా సినిమాలు చేస్తూ.. స్టార్ హీరోగా రాణిస్తున్నాడు గోపీచంద్. కొంచెం సిగ్గు పడే స్వభావం గల గోపీచంద్‌కు.. టాలీవుడ్‌లో మంచి స్నేహితుడు ఎవరు అని అడిగితే మాత్రం ఏ మాత్రం ఆలోచించకుండా ప్రభాస్ అని చెప్పేస్తాడు.

పక్కా కమర్షియల్ సినిమా పోస్టర్

మా స్నేహం.. అప్పటి నుంచే

సినిమాల్లోకి రాక ముందు నుంచే ప్రభాస్, గోపీచంద్ స్నేహితులు. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆ స్నేహం మరింత బలపడిందని ఇద్దరు స్టార్లూ చెప్తూనే ఉంటారు. ఇక, కొంతకాలంగా గోపీచంద్‌ సరైన హిట్‌ కోసం ప్రయత్నిస్తున్నాడు. 'సీటీమార్ ' సినిమాతో గోపీచంద్ హిట్‌ ట్రాక్ ఎక్కారు. తాజాగా ఆయన నటించిన సినిమా ‘పక్కా కమర్షియల్’ విడుదలకు సిద్ధంగా ఉంది. జూలై 1వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా ఒక మీడియా ప్రతినిధి గోపీచంద్‌ను పలు ప్రశ్నలు అడిగారు. దానికి గోపీచంద్ ఇచ్చిన సమాధానాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ప్రభాస్‌ సినిమాలో విలన్‌గా చేయాలని అడిగితే చేస్తారా? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు గోపీచంద్ షాకింగ్ సమాధానం చెప్పారు.

'తన సినిమాలో యాక్ట్‌ చేయమని ప్రభాస్ (Prabhas) అడిగితే తప్పకుండా చేస్తాను. క్యారెక్టర్‌‌ ఏంటని కూడా ప్రశ్నించను. ఏ క్యారెక్టర్ అయినా చేస్తాను ' అని సమాధానం ఇచ్చారు గోపీచంద్. ‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్’ సినిమాలో గోపిచంద్ స‌ర‌స‌న హీరోయిన్‌గా రాశీ ఖన్నా న‌టించింది.

స‌త్యరాజ్‌, శ్రీనివాస్ రెడ్డి, అన‌సూయ‌, రావు ర‌మేష్ ఈ సినిమాలో కీల‌క‌పాత్రలు పోషించారు. యూవీ క్రియేష‌న్స్‌, జీఎ2 పిక్చర్స్ బ్యాన‌ర్లపై బ‌న్ని వాస్‌, వంశీ, ప్రమోద్‌లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ‘పక్కా కమర్షియల్‌’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, జూన్ 26న జ‌రగనుంది. మెగాస్టార్ చిరంజీవి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్‌ గెస్ట్‌గా హాజరుకానున్నారు.

 Read More : రెమ్యునరేషన్‌ విషయంలో తగ్గేదేలే.. నేను ‘పక్కా కమర్షియల్’ : హీరో గోపీచంద్‌ (Gopichand)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!