Sonali Bendre: ఎన్టీఆర్, కొర‌టాల శివ సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌లో సోనాలి బింద్రే.. నిజ‌మెంత‌?

Updated on May 31, 2022 09:17 PM IST
ఎన్టీఆర్ 30 మూవీ పోస్ట‌ర్, సోనాలి బింద్రే (NTR30 Poster, Sonali Bendre)
ఎన్టీఆర్ 30 మూవీ పోస్ట‌ర్, సోనాలి బింద్రే (NTR30 Poster, Sonali Bendre)

Sonali Bendre: ఒక‌ప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలంద‌రితో సినిమాలు చేసి తెలుగులో అగ్ర‌ క‌థానాయికగా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ సొనాలీ బింద్రే. సూప‌ర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన 'మురారి' సినిమాతో మంచి హిట్ అందుకున్న సొనాలీ.. ఆ త‌ర్వాత తెలుగులో ఇంద్ర‌, ఖ‌డ్గం, మ‌న్మ‌ధుడు, శంక‌ర్ దాదా ఎంబీబీఎస్ లాంటి సినిమాల‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో చేసింది త‌క్కువ సినిమాలే అయినా ఆమెకున్న క్రేజ్ మాత్రం బాగానే ఉంది. 

అయితే, 2018లో కాన్స‌ర్ బారినప‌డి కోలుకున్న సొనాలీ బింద్రే (Sonali Bendre).. ప్ర‌స్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల‌ ప్ర‌ముఖ బ్రిటీష్ టెలివిజ‌న్ సిరీస్ 'ప్రెస్' ఆధారంగా తెర‌కెక్కిన 'ది బ్రోకెన్ న్యూస్' వెబ్‌ సిరీస్‌లో సోనాలి బింద్రే నటించారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా సోనాలి తెలుగులో రీఎంట్రీ ఇస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్‌, కొర‌టాల శివ కాంబోలో త్వరలోనే తెరకెక్కనున్న సినిమా (ఎన్టీఆర్‌ 30)లో ఈ మాజీ హీరోయిన్ ఓ కీల‌క‌ పాత్ర‌ చేస్తున్నారని ఫిల్మ్ నగర్ వ‌ర్గాలు కోడై కూసాయి. ఆమె ఇందులో సినిమాను మలుపు తిప్పే పాత్రలో సోనాలి నటిస్తారని అన్నారు. ఈ క్ర‌మంలోనే ఆ ఈ వార్తలపై సోనాలి స్పందించారు.  

సోనాలి బింద్రే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విష‌యంపై క్లారిటీ ఇచ్చింది. ఎన్టీఆర్ (NTR) చిత్రంలో తాను నటించబోతున్నట్లు వస్తున్న వార్తలపై ముందుగా ఆమె షాక్ అయ్యారు. ఆ త‌ర్వాత‌ సోనాలి మాట్లాడుతూ.. నో.. నాకు దీని గురించి అస్స‌లు తెలియదు.. మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. ఇది ఫేక్ న్యూస్ అంటూ సోనాలి బింద్రే క్లారిటీ ఇచ్చింది. దీని గురించి నన్ను ఎవరూ సంప్రదించలేదని ఆమె తెలిపింది.

ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్‌, కొరటాల శివ (koratala Siva) చిత్రాన్ని నందమూరి కల్యాణ్‌ రామ్‌, మిక్కిలినేని సుధాకర్‌, హరికృష్ణ కె సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ఇద్దరి కలయికలో ఇదివరకు వచ్చిన 'జనతా గ్యారేజ్‌' సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ఎన్టీఆర్‌ 30పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్‌కు అదిరిపోయే రెస్పాన్స్‌ వచ్చింది. పోస్టర్ ను బట్టి చూస్తుంటే ఎన్టీఆర్ ఈ సినిమాలో సరికొత్తగా కనిపించనున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌ ఎవరు అన్నది ఇప్పటివరకు తెలియరాలేదు. అలియా భట్ (Alia Bhatt), సాయి పల్లవి, జాన్వీ కపూర్ ఇలా చాలా పేర్లు వినిపిస్తున్నాయి. 

అయితే, ఎన్టీఆర్ మూవీ అప్డేట్స్ కోసం ఆయ‌న అభిమానులు ఇంకొంత కాలం ఎదురుచూడక తప్పదు. సోనాలి బింద్రే టాలీవుడ్ లో (Tollywood) గోల్డెన్ హీరోయిన్ అనే చెప్పాలి. ఆమె నటించిన ఎక్కువ చిత్రాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. మురారి, ఇంద్ర, మన్మథుడు, ఖడ్గం, శంకర్ దాదా ఎంబీబీఎస్ ఇలా ఆమె నటించిన చిత్రాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. పలనాటి బ్రహ్మనాయుడు చిత్రం మాత్రం నిరాశపరిచింది. ఆ మధ్యన క్యాన్సర్ కి గురైన సోనాలి బింద్రే ఫారెన్ లో ట్రీట్మెంట్ తీసుకుని ఇటీవ‌లే కోలుకున్న సంగ‌తి తెలిసిందే. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!