మహేష్‌బాబు (MaheshBabu) పోకిరి, పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) జల్సా సినిమాల రీరిలీజ్‌తో ఆనందంలో ఇలియానా!

Updated on Sep 01, 2022 12:01 PM IST
మహేష్‌బాబు (MaheshBabu), పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే ఫ్యాన్స్‌కు పండుగే
మహేష్‌బాబు (MaheshBabu), పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే ఫ్యాన్స్‌కు పండుగే

మహేష్‌బాబు (MaheshBabu), పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan).. ఈ హీరోలకు ఉన్న క్రేజే వేరు. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా ఈ ఇద్దరు హీరోలకూ ఫ్యాన్ బేస్ ఉంది. పవన్‌, మహేష్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే అభిమానులకు పండుగే. వీళ్లిద్దరి పక్కన హీరోయిన్‌గా నటించాలని ప్రతి  హీరోయిన్‌కీ ఉంటుంది. అటువంటి అవకాశం దక్కించుకున్న హీరోయిన్లతో ఇలియానా కూడా ఒకరు.

ఇలియానా.. ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ హీరోగా నటించిన దేవదాసు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. తన అందంతో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు. దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్‌వైపు వెళ్లారు.

ఇక, ప్రస్తుతం స్టార్ హీరోల పుట్టినరోజులకు వారువారు నటించిన హిట్‌ సినిమాలను రీరిలీజ్ చేసే ట్రెండ్‌ టాలీవుడ్‌లో నడుస్తోంది. మహేష్‌బాబు పుట్టినరోజు సందర్భంగా మొదలైన ఈ ట్రెండ్‌.. చిరంజీవి పుట్టినరోజున ఘరానా మొగుడు సినిమా రీరిలీజ్‌ చేయడంతో కొనసాగింది. మహేష్‌ పుట్టినరోజు సందర్భంగా పోకిరి, ఒక్కడు సినిమాలను 4కే చేసి రీరిలీజ్ చేశారు మేకర్స్. దీనికి అనూహ్య స్పందన వచ్చింది.

మహేష్‌బాబు (MaheshBabu), పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే ఫ్యాన్స్‌కు పండుగే

రెండు సినిమాల్లోనూ ఒకే హీరోయిన్..

సెప్టెంబర్‌‌ 2వ తేదీన పవర్‌‌స్టార్‌‌ పవన్‌ కల్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా జల్సా, తమ్ముడు సినిమాలను రీరిలీజ్‌ చేయడానికి ప్లాన్ చేశారు మేకర్స్. పవన్‌ కల్యాణ్ కెరీర్‌‌లో మైలు రాయిగా నిలిచిన జల్సా సినిమాను పవన్ అభిమానులతోపాటు, సినీ ప్రేమికులు కూడా విపరీతంగా లైక్ చేస్తారు. పవన్ బర్త్‌డే రోజున రీరిలీజ్ అయ్యే జల్సా సినిమా థియేటర్లలో అభిమానులు ఏ రేంజ్‌లో ఎంజాయ్ చేస్తారనేది చూడాలి మరి.

మహేష్‌బాబు (MaheshBabu) పోకిరి, పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) జల్సా సినిమాల్లో హీరోయిన్‌గా చేశారు ఇలియానా. ఈ రెండు సినిమాల రీరిలీజ్‌తో ఆనందపడుతున్నారు. ఇలియానా. టాలీవుడ్‌లో సినిమా చేసి చాలా కాలమే అవుతున్నా.. తన కెరీర్‌‌లో సూపర్‌‌హిట్‌ సినిమాలైన పోకిరి, జల్సా సినిమాలు రీరిలీజ్ అవుతుండడంతో..బిగ్‌ స్క్రీన్‌పై కనిపించబోతున్నానని ఖుషీ అవుతున్నారు.

Read More : పవర్‌‌స్టార్ పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్స్‌కు డబుల్ థమాకా.. ‘జల్సా’తోపాటు ‘తమ్ముడు’ సినిమా కూడా!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!