‘ఎస్‌ఎస్‌ఎంబీ29’లో మహేష్‌బాబు (MaheshBabu)తో కలిసి నటించనున్న హాలీవుడ్ యాక్టర్ శామ్యూల్ ఎల్ జాక్సన్!

Updated on Sep 24, 2022 07:22 PM IST
సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu) ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు
సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu) ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు

సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట సినిమాల సక్సెస్‌తో జోష్‌ మీద ఉన్నారు సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu). మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నారు ప్రిన్స్. ఈ సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ ఇటీవల పూర్తయ్యింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నట్టు కూడా ప్రకటించింది. ఎస్‌ఎస్‌ఎంబీ28 వర్కింగ్ టైటిల్‌తో మహేష్‌బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్‌ సినిమా తెరకెక్కుతోంది.

బాహుబలి1,2, ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు రాజమౌళి. ఇక, ఎస్‌ఎస్‌ఎంబీ28 తర్వాత మహేష్‌బాబు.. రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారు రాజమౌళి. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయని టాక్. ప్రపంచం మొత్తం ట్రావెల్‌ (గ్లోబ్‌ ట్రోటింగ్) చేసే అడ్వంచరస్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఎస్‌ఎస్‌ఎంబీ29 సినిమా తెరకెక్కించనున్నట్టు తెలిపారు రాజమౌళి.

సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu) ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు

ముందు నుంచీ భారీ అంచనాలే..

మహేష్ – రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా కోసం ప్రిన్స్ అభిమానులతోపాటు సినీ ప్రేమికులు కూడా చాలా సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు. వీరిద్దరి కాంబోలో సినిమా చేయబోతున్నట్టు వార్త వచ్చినప్పటి నుంచి సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా గురించిన ఒక ఇంట్రెస్టింగ్‌ వార్త నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఎస్‌ఎస్‌ఎంబీ29 సినిమాలో హాలీవుడ్‌ యాక్టర్‌‌ నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి.

XXX, కెప్టెన్ అమెరికా, కెప్టెన్ మార్వెల్, స్టార్ వార్స్, స్పైడర్ మ్యాన్, అవెంజర్స్ వంటి హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ సినిమాల్లో నటించిన శామ్యూల్ ఎల్ జాక్సన్‌ను ఎస్‌ఎస్‌ఎంబీ29 సినిమా కోసం చిత్ర యూనిట్ సంప్రదించిందని టాక్. త్రివిక్రమ్ సినిమా కోసం మహేష్‌బాబు (MaheshBabu) కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ మేకోవర్‌‌తో ఆయన హాలీవుడ్ యాక్టర్‌‌గా కనిపిస్తున్నారని ప్రశంసలు కూడా వస్తున్నాయి. దాదాపు రూ.8‌00 కోట్ల భారీ బడ్జెట్‌తో ఎస్‌ఎస్‌ఎంబీ29 సినిమాను రాజమౌళి తెరకెక్కించనున్నారని టాక్. ఈ వార్తల్లో నిజం ఎంతుందో తెలియాలంటే చిత్ర యూనిట్‌ నుంచి అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.

Read More : మహేష్‌బాబు (MaheshBabu) – త్రివిక్రమ్ సినిమాలో మలయాళ స్టార్ హీరో.. నిజమెంతో మరి?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!