నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా నుంచి కృతిశెట్టి (Krithi Shetty) ఫస్ట్ లుక్ విడుద‌ల

Updated on Jul 18, 2022 12:47 AM IST
మాచర్ల నియోజకవర్గం సినిమాలో నితిన్, కృతి శెట్టి (Krithi Shetty)
మాచర్ల నియోజకవర్గం సినిమాలో నితిన్, కృతి శెట్టి (Krithi Shetty)

ఉప్పెన సినిమాతో యూత్ గుండెలను కొల్లగొట్టారు కృతిశెట్టి (Krithi Shetty). ఈ సినిమా తర్వాత వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నారు కృతి. ఈ క్రమంలోనే నాగార్జున, నాగచైతన్య నటించిన బంగార్రాజు సినిమాలో హీరోయిన్‌గా నటించారు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా లింగుసామి దర్శకత్వం వహించిన ది వారియర్ సినిమాలో చాన్స్ కొట్టేశారు కృతి. ఈ సినిమా ఇటీవలే రిలీజై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

 కృతి శెట్టి తాజాగా నటిస్తున్న సినిమా మాచర్ల నియోజకవర్గం. ఈ సినిమాలో నితిన్ హీరోగా నటిస్తుండగా.. డైరెక్టర్‌‌ ఎమ్‌ఎస్ రాజశేఖరరెడ్డి ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా కేథరిన్ ట్రెసా నటిస్తున్నారు. ఆగస్టు 12వ తేదీన మాచర్ల నియోజకవర్గం సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దాంతో ప్రమోషన్స్‌లో వేగం పెంచింది చిత్ర యూనిట్.

మాచర్ల నియోజకవర్గం సినిమాలో కృతి శెట్టి (Krithi Shetty)

క్రేజ్ పెంచుతూ..

ఈ క్రమంలోనే మాచర్ల నియోజకవర్గం సినిమా నుంచి పలు అప్‌డేట్లను ఇస్తూ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఇటీవలే ఈ సినిమా నుంచి స్పెషల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అంజలి నర్తించిన ఈ స్పెషల్ సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేయగా.. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా హీరోయిన్ కృతి శెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్‌‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

గాగుల్స్ పెట్టుకుని, కర్లీ జుట్టుతో కాఫీ కప్‌తో కృతి శెట్టి చిరునవ్వులు చిందిస్తున్న పోస్టర్‌‌ను రిలీజ్‌ చేసింది చిత్ర యూనిట్. మాచర్ల నియోజకవర్గంలో కృతిశెట్టి (Krithi Shetty) స్వాతి క్యారెక్టర్‌‌లో కనిపించనుందని రివీల్ చేశారు. పక్కా మాస్ పొలిటికల్ ఎంటర్‌‌టైనర్‌‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను నితిన్‌ సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ట్‌ మూవీస్ బ్యానర్‌‌పై సుధాకర్‌‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. మాచర్ల నియోజకవర్గం సినిమాలో సముద్రఖని విలన్‌గా నటిస్తున్నారు.

 Read More : పొలిటికల్ డ్రామాగా బాలకృష్ణ (Bala Krishna) – బోయపాటి కాంబినేషన్‌లో నాలుగో సినిమా?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!