పొలిటికల్ డ్రామాగా బాలకృష్ణ (Bala Krishna) – బోయపాటి కాంబినేషన్‌లో నాలుగో సినిమా?

Updated on Jul 18, 2022 12:24 AM IST
బాలకృష్ణ (Bala Krishna), బోయపాటి
బాలకృష్ణ (Bala Krishna), బోయపాటి

నందమూరి నటసింహం బాలకృష్ణ (Bala Krishna), డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్‌లో సినిమా అంటే బాలయ్య ఫ్యాన్స్‌తోపాటు సినీ ప్రేమికులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తారు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇప్పటికే వచ్చిన మూడు సినిమాలు సూపర్ డూపర్ హిట్‌ అయ్యాయి.

బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ సూపర్ హిట్‌ అయ్యాయి. ఈ మూడు సినిమాలు బాలయ్య కెరీర్‌‌లోనే బిగ్గెస్ట్‌ హిట్లుగా నిలిచాయి. ఇటువంటి క్రేజీ కాంబినేషన్‌లో మరో సినిమా రానుందనే వార్తలు ఇండస్ట్రీలో హల్‌చల్ చేశాయి. వీరిద్దరి కాంబినేషన్‌ సినిమా అంటే సామాన్యంగానే అభిమానుల్లో భారీ అంచనాలు ఉంటాయి. ప్రస్తుతం ఈ సినిమాపై ఒక క్రేజీ అప్‌డేట్‌ ఇండస్ట్రీ వర్గాలను కూడా షాక్‌కు గురిచేస్తోంది.

బాలకృష్ణ (Bala Krishna), బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాల పోస్టర్లు

మళ్లీ రికార్డుల మోతేనా..

బాలకృష్ణ (Bala Krishna) – బోయపాటి హిట్ కాంబినేషన్‌లో సినిమా వస్తోందంటే బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే. ఇప్పటి వరకు వచ్చిన మూడు సినిమాలు యాక్షన్ ఎంటర్‌‌టైనర్లుగా ప్రేక్షకులను అలరించాయి. అయితే ఈసారి వచ్చే సినిమా పొలిటికల్ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కనున్నట్టు టాక్. ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే 2024 ఎన్నికల్లో టీడీపీకి కలిసొచ్చేలా సినిమా కథను తయారు చేస్తున్నారని సమాచారం. సినిమా గురించిన మిగిలిన సమాచారం తెలియకున్నా.. స్క్రిప్ట్‌ వర్క్‌ మాత్రం జరుగుతోందని తెలుస్తోంది.  

ఈ సినిమా సంగతి పక్కన పెడితే.. అఖండ సినిమాకు సీక్వెల్‌ కూడా తెరకెక్కనుందని టాక్. బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్‌లో రాబోయే నాలుగో సినిమా అఖండ సినిమాకు సీక్వెల్‌గా రూపొందుతుందా లేక కొత్త ప్రాజెక్టా అనే దానిపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు.

బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఎన్‌బీకే107 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతుండగా.. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మరో సినిమాను కూడా బాలయ్య (Bala Krishna) కమిట్ అయ్యారు. ఈ రెండు సినిమాల తర్వాత బోయపాటి సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందనే వార్త నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.

Read More : వయసు 62 .. ఇండస్ట్రీ @ 50 .. అన్‌స్టాపబుల్‌ : నేడు నందమూరి బాలకృష్ణ (BalaKrishna) పుట్టినరోజు !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!