ఇంటర్వ్యూలో ప్రాంక్‌ చేసిన యాంకర్లు.. లైవ్‌లో ఏడ్చేసిన ఉప్పెన హీరోయిన్‌ కృతి శెట్టి (Krithi Shetty)

Updated on May 30, 2022 08:27 PM IST
కృతి శెట్టి (Krithi Shetty)
కృతి శెట్టి (Krithi Shetty)

'ఉప్పెన' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ కృతిశెట్టి (Krithi Shetty). మొదటి సినిమాతోనే బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ సొంతం చేసుకున్న కృతి.. 'శ్యామ్ సింగరాయ్', 'బంగార్రాజు' సినిమాలతో హ్యాట్రిక్ హిట్ అందుకుంది. ప్రస్తుతం రామ్‌తో కృతి శెట్టి నటించిన 'ది వారియర్' చిత్రం​ త్వరలో విడుదల కాబోతోంది. అదే కాకుండా సుధీర్‌ బాబుతో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', నితిన్‌ సరసన 'మాచర్ల నియోజకవర్గం' సినిమాలు చేస్తోంది.

ఇటీవల తమిళనాడులో జరిగిన ఓ ఇంటర్వ్యూలో కృతిశెట్టి కన్నీళ్లు పెట్టుకుంది. యాంకర్ల ప్రవర్తన చూసి ఇంటర్వ్యూలోనే ఏడ్చేసింది బేబమ్మ. ఇంటర్వ్యూ జరుగుతుండగా కృతిశెట్టిని ప్రశ్నలు అడిగేందుకు ఇద్దరు యాంకర్లు పోటీ పడ్డారు. తర్వాత ఒకరిపై ఒకరు కేకలు వేసుకుంటూ కృతిశెట్టి ఎదుటే గొడవకు దిగారు. ఒక యాంకర్‌‌పై మరో యాంకర్‌ చేయి చేసుకున్నాడు. దీంతో ఏం జరుగుతోందో తెలియని బేబమ్మ భయపడిపోయింది.

కృతి శెట్టి (Krithi Shetty)

అయితే ఆ తర్వాత అది ప్రాంక్‌ అని చెప్పడంతో ఊపిరి పీల్చుకుని నవ్వింది కృతిశెట్టి. పైకి నవ్వినా ఆపై దుఃఖం ఆపుకోలేక లైవ్‌లోనే ఏడ్చేసింది కృతి. కొద్దిసేపటి తర్వాత ఆమెకు సర్దిచెప్పిన యాంకర్లు.. ఎందుకు ఏడ్చారు, ఏమైంది అని ప్రశ్నించారు. దానికి ఎవరైనా హార్డ్‌గా మాట్లాడితే తట్టుకోలేను, భయం వేస్తుంది అని చెప్పుకొచ్చింది 18 ఏళ్ల కృతిశెట్టి. అయితే ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియోపై నెటిజన్లు, అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. 

ఇక, రామ్‌తో నటించిన ది వారియర్ సినిమాలో హీరోయిన్‌గా కృతిశెట్టి  (Krithi Shetty) నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్‌‌కు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన బులెట్‌ పాటకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ పాటలో రామ్‌ పక్కన కృతి చేస్తున్న డ్యాన్స్‌కు బేబమ్మ అభిమానులు ఖుషీగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!