ఎన్టీఆర్ (Junior NTR) సరసన నటించేందుకు నేను రెడీ.. ఆయన అంటే చాలా ఇష్టం: జాన్వీ కపూర్ (Janhvi Kapoor)

Updated on Oct 28, 2022 01:38 PM IST
జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR)కు జోడీగా నటించే అవకాశం వస్తే అస్సలు వదులుకోనని జాన్వీ కపూర్ (Janhvi Kapoor) అన్నారు
జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR)కు జోడీగా నటించే అవకాశం వస్తే అస్సలు వదులుకోనని జాన్వీ కపూర్ (Janhvi Kapoor) అన్నారు

దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ (Janhvi Kapoor)కు యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. అందచందాలతోనే గాక నటనతోనూ యువతలో ఆమె పాపులారిటీ సంపాదించారు. స్టార్ హీరోల సినిమాలతోపాటు మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లోనూ నటిస్తూ బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఆమె దూసుకుపోతున్నారు. ఇక గ్లామరస్ ఫొటోలను, తన జీవితంలోని విశేషాలను అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడియాలోనూ జాన్వీ యాక్టివ్‌గా ఉంటారు. 

హిందీలో జాన్వీ కపూర్ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. శ్రీదేవి కూతురుగా ఆమెను తెలుగు తెరకు పరిచయం చేయడానికి ఇక్కడి మేకర్స్ పలు ప్రయత్నాలు చేసినప్పటికీ ఏవీ సఫలం కాలేదు. అయితే జాన్వీ తండ్రి బోనీ కపూర్ మాత్రం సౌత్ సినిమాల్లో నటించేందుకు తన కూతురు ఆసక్తి చూపిస్తున్నారని ఈ మధ్య ఒక వేదికపై అన్నారు. ఇదే విషయాన్ని జాన్వీ కూడా చెబుతున్నారు. దక్షిణాది చిత్రాల్లో యాక్ట్ చేయాలని చూస్తున్నానని.. సరైన సినిమా వస్తే ఇక్కడ అరంగేట్రం చేస్తానని అన్నారు. 

ఎన్టీఆర్ (Junior NTR) అంటే తనకు ప్రత్యేకమైన అభిమానం అని జాన్వీ (Janhvi Kapoor) చెప్పారు

‘ఆర్ఆర్ఆర్’ మూవీ తనకు బాగా నచ్చిందని జాన్వీ కపూర్ చెప్పారు. ఎన్టీఆర్–చరణ్ ఇద్దరూ ఆ సినిమాలో అదరగొట్టేశారని ప్రశంసల జల్లులు కురిపించారు. తెలుగు నాట ప్రభాస్, మహేశ్, చరణ్, ఎన్టీఆర్, బన్నీ నటన తనకు ఇష్టమని జాన్వీ పేర్కొన్నారు. అయితే తారక్ (Junior NTR)తో నటిస్తే అవకాశం వస్తే మాత్రం అస్సలు వదులుకోనని స్పష్టం చేశారు. ఆయనంటే తనకు ప్రత్యేకమైన అభిమానం ఉందని జాన్వీ చెప్పుకొచ్చారు. దీంతో ఎన్టీఆర్ సరసన ఆమె నటించే సమయం ఎప్పుడొస్తుందోనని ఆమె అభిమానులు ఆలోచిస్తున్నారు. 

ఇకపోతే, జాన్వీ కపూర్ నటించిన ‘గుడ్ లక్ జెర్రీ’ ఫిల్మ్ ఇటీవలే విడుదలై థియేటర్లలో సందడి చేసింది. ఈ సినిమాలో నటనకు జాన్వీ మంచి మార్కులే కొట్టేశారు. కానీ కలెక్షన్ల పరంగా ఈ చిత్రం నిరాశపర్చింది. అయితే, త్వరలో ‘మిలీ’గా జాన్వీ మళ్లీ పెద్ద తెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ మూవీ ప్రమోషన్లలో ప్రస్తుతం ఆమె బిజీబిజీగా ఉన్నారు. మరి, ఈ చిత్రంతోనైనా జాన్వీ బిగ్ హిట్ కొడతారేమో చూడాలి. 

Read more: అవసరమైతే ఆ విషయాన్ని నా రక్తంతో రాసిస్తా: జాన్వీ కపూర్ (Janhvi Kapoor) సంచలన కామెంట్స్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!