లంగా ఓణీలో అచ్చమైన తెలుగమ్మాయిలా తిరుమలలో వాలిపోయిన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor)..!

Updated on Sep 03, 2022 05:51 PM IST
శ్రీవారి ఆలయం బయట జాన్వీ కెమెరాల కంట పడటంతో ఈ ఫొటోలు (Janhvi Photos Viral) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
శ్రీవారి ఆలయం బయట జాన్వీ కెమెరాల కంట పడటంతో ఈ ఫొటోలు (Janhvi Photos Viral) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor).. అతిలోక సుందరి శ్రీదేవి (Sri devi) కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ ఆనతి కాలంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమైన జాన్వీ కపూర్ సౌత్ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా జాన్వీ కపూర్ తిరుమలకు విచ్చేసి శ్రీవారిని దర్శించుకుంది. 

తన స్నేహితురాళ్లతో కలిసి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంది హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). నిన్న ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో జాన్వీ స్వామివారి సేవలో పాల్గొంది. 

అచ్చమైన తెలుగింటి అమ్మాయిలా సాంప్రదాయ దుస్తులలో కనిపించి ఆకట్టుకుంది. దర్శనానంతరం అర్చకులు ఆమెకు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.

తిరుమలలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Bollywood Beauty Janhvi Kapoor in Tirumala)

కాగా, గతంలో కూడా జాన్వీ చాలా సార్లు తిరుమల (Tirumala) వచ్చి స్వామివారిని దర్శించుకుంది. ఈ సారి ఆమె లంగా ఓణిలో మెరిసి శ్రీవారిని దర్శించింది. జాన్వీ నీలి రంగు లంగా ఓణిలో అద్భుతంగా కనిపించింది. సంప్రదాయంగా వచ్చి స్వామివారిని దర్శించుకుంది. దేవస్థానం వద్ద మోకాళ్ళ మీద సాష్టాంగ నమస్కారం చేసింది. తన మొక్కులను తీర్చుకుంది. ఆ తర్వాత తిరుమల మాడ వీధుల్లో తన స్నేహితురాళ్ళతో కలిసి సందడి చేసింది. 

శ్రీవారి ఆలయం బయట జాన్వీ కెమెరాల కంట పడటంతో ఈ ఫొటోలు (Janhvi Photos Viral) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, జాన్వీ కపూర్ తిరుపతికి వచ్చిందన్న వార్త తెలియగానే అభిమానులు ఆమెను చూసేందుకు రోడ్డుపైకి పెద్ద ఎత్తున వచ్చారు.

జాన్వీ కపూర్ ఇటీవల ఓటీటీలో రిలీజైన 'గుడ్ లక్ జెర్రీ' (Good Luck Jerry) తో హిట్ సొంతం చేసుకుంది. ఇక తదుపరి ప్రాజెక్టు 'బవాల్' షూటింగ్ జరుగుతుండగా.. ప్రొఫెషనల్ లైఫ్ కు కాస్త విరామం ఇచ్చిన జాన్వీ శ్రీవారిని దర్శించుకుంది. 

Read More: Janhvi Kapoor: జాన్వీ కపూర్ తాజా సినిమా 'గుడ్ లక్ జెర్రీ' సినిమాపై నయనతార ప్రశంసలు.. ఆనందంలో బాలీవుడ్ బ్యూటీ!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!