ఎన్టీఆర్, కొరటాల సినిమాలో.. శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ (Jhanvi Kapoor)

Updated on May 26, 2022 04:04 PM IST
ఎన్టీఆర్‌తో సినిమాలో కథానాయికగా శ్రీదేవి, బోనికపూర్‌‌‌ల కుమార్తె జాన్వీ కపూర్‌ను తీసుకోవాలని కొరటాల భావిస్తున్నారట
ఎన్టీఆర్‌తో సినిమాలో కథానాయికగా శ్రీదేవి, బోనికపూర్‌‌‌ల కుమార్తె జాన్వీ కపూర్‌ను తీసుకోవాలని కొరటాల భావిస్తున్నారట

RRR సినిమా సక్సెస్ తర్వాత, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమాకు ఓకే చెప్పారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Junior NTR). ఇదే క్రమంలో దర్శకుడు కొరటాల శివ చెప్పిన కథ నచ్చి, ఆయన సినిమాకి కూడా సైన్ చేశారు. మరో రెండు నెలలలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుందని వినికిడి. కొరటాల, ఎన్టీఆర్ కాంబినేషనులో గతంలో విడుదలైన 'జనతా గ్యారేజ్' ఎంత పెద్ద సూపర్ హిట్టో మనకు తెలియంది కాదు. ఈ క్రమంలో ఈ కొత్త సినిమా పై కూడా అభిమానుల అంచనాలు భారీగా పెరిగాయి.
 
కల్యాణ్ రామ్,  మిక్కిలినేని సుధాకర్ నిర్మించే ఈ సినిమాకి, అనిరుధ్ పాటలకు బాణీలను సమకూర్చనున్నారు. అలాగే ఈ సినిమాలో కథానాయికగా శ్రీదేవి, బోనికపూర్‌‌‌ల కుమార్తె జాన్వీ కపూర్‌ను తీసుకోవాలని కొరటాల భావిస్తున్నారట. అలాగే తమ సినిమాతోనే ఆమెను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేయాలని ఆయన యోచిస్తున్నారట.

సబ్జెక్టు నచ్చితే జాన్వీ కపూర్ (Jhanvi Kapoor) తెలుగుతో పాటు ఇతర భాషలలో కూడా చేయడానికి సిద్ధంగా ఉందని ఇటీవలే బోనీ కపూర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దీంతో శ్రీదేవి కూతురిని తెలుగు తెరకు పరిచయం చేయడానికి ఇండస్ట్రీలో బాగానే కసరత్తు జరుగుతోందని మనం చెప్పుకోవచ్చు. 
 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!