తల్లయ్యాక నేను చాలా మారా.. ఇంతకుముందు కంటే ఇప్పుడు ఎంతో స్వేచ్ఛగా ఆలోచిస్తున్నా: అలియా భట్ (Alia Bhatt)

Updated on Dec 08, 2022 05:28 PM IST
తల్లయ్యాక తన ఆలోచన తీరులో చాలా మార్పులొచ్చాయని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ (Alia Bhatt) చెబుతున్నారు
తల్లయ్యాక తన ఆలోచన తీరులో చాలా మార్పులొచ్చాయని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ (Alia Bhatt) చెబుతున్నారు

యువతరంలో మంచి క్రేజ్ ఉన్న నటీమణుల్లో అలియా భట్ (Alia Bhatt) ఒకరు. గ్లామర్ రోల్స్ తనను వెతుక్కుంటూ వస్తున్నా కాదని.. వైవిధ్యమైన పాత్రలను పోషించేందుకే ఆసక్తి చూపిస్తున్నారు అలియా. ‘హైవే’, ‘బద్రీనాథ్ కీ దుల్హనియా’, ‘టు స్టేట్స్’, ‘రాజీ’, ‘గంగూబాయి కతియావాడీ’ లాంటి చిత్రాలతో తనలోని సిసలైన నటిని ప్రేక్షకులకు ఆమె పరిచయం చేశారు. ముఖ్యంగా ‘రాజీ’, ‘గంగూబాయి’ సినిమాలు అలియా నటనా పటిమకు నిదర్శనంగా నిలిచాయి.

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’తో అలియా భట్ పాన్ ఇండియా గుర్తింపును సొంతం చేసుకున్నారు. సీత పాత్రలో తనదైన శైలిలో నటించి అందర్నీ మెప్పించారామె. ఇక బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌ను అలియా ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆమె తల్లై మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నారు. తల్లయ్యాక తన ఆలోచన తీరులో చాలా మార్పులు వచ్చాయని అలియా చెబుతున్నారు. 

తన భవిష్యత్తు ఎలా ఉంటుందో అని తానే ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని అలియా (Alia Bhatt) చెప్పుకొచ్చారు

‘తల్లిగా కొత్త జీవితంలోకి అడుగుపెట్టా. దీంతో నా వ్యక్తిగత జీవితంలో పెను మార్పులే చోటుచేసుకున్నాయి. ఇంతకుముందు కంటే ఇప్పుడు మరింత స్వేచ్ఛగా ఆలోచిస్తున్నా. అది ఎందుకు? ఎలా? అనే విషయాలు ఇంకా నాకే తెలియడం లేదు. నా ఈ తీరు నా సినిమా జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో కూడా నాకు తెలియదు. క్యారెక్టర్స్ సెలెక్షన్‌లోనూ నా నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడే చెప్పలేను. నా భవిష్యత్తు ఎలా ఉంటుందో అని నేనే ఆత్రుతగా ఎదురుచూస్తున్నా’ అని అలియా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కరణ్‌ జోహార్‌ సినిమా ‘రాకీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ’తో పాటు హాలీవుడ్‌ మూవీ ‘హార్ట్‌ స్టోన్‌’లో అలియా నటిస్తున్నారు. 

Read more: ఐఎం‌డీబీ (IMDB) మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ టాప్ 10 జాబితాలో ముగ్గురు తెలుగు హీరోలు!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!