Junior NTR : జూనియర్ ఎన్టీఆర్, జాన్వికపూర్ కాంబినేషన్‌లో తెలుగు సినిమా ? ఈ వార్త నిజమా .. రూమరా ?
అలనాటి అందాల తార, అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్ (Janhvi Kapoor), జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషనులో ఓ సినిమా తెరకెక్కనుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, ఆ వార్తలలో నిజం లేదని తర్వాత తెలిసిపోయింది. అయితే జాన్వి కపూర్ ఇటీవలే ఓ ఆసక్తికరమైన విషయాన్ని తెలిపింది.
తనకు సౌత్ సినిమాలు అంటే చాలా ఇష్టమని.. అవకాశాలు వస్తే తెలుగు, తమిళ, మలయాళ భాషలలో నటించడానికి తనకు అభ్యంతరం లేదని ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. తన తల్లి మాదిరిగానే తాను దక్షిణాది చిత్రాలలో కూడా నటించి పేరు తెచ్చుకోవాలని భావిస్తున్నానని తన అభిప్రాయాన్ని తెలిపింది.
ఆ సినిమాలు రీమేక్ చేయను
అలాగే శ్రీదేవి (Sridevi) చేసిన దక్షిణాది చిత్రాలను జాన్వి ' రీమేక్ చేసే అవకాశం ఉందా? ' అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు కూడా ఆమె బదులిచ్చింది. 'నా తల్లి గారు చేసిన పాత్రలను నేను చేసే సాహసం చేయలేను. ఆమె తన ప్రతి సినిమా ద్వారా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. ఆమెలా చేయడం నాకు సాధ్యం కాదు' అని తెలిపింది జాన్వి కపూర్ (Janhvi Kapoor).
అవి పుకార్లే
ఏదేమైనా, జాన్వి కపూర్ (Janhvi Kapoor) దక్షిణాది సినిమాలకు సైన్ చేసిందని, ఈ మధ్యకాలంలో చాలా పుకార్లు వచ్చాయి. కానీ తాను ఎలాంటి సినిమాలకు సైన్ చేయలేదని జాన్వి క్లారిటీ ఇచ్చేసింది. కాకపోతే, అవకాశం వస్తే, తప్పకుండా సౌత్‌లో మంచి సినిమాలు చేయాలని ఉందని ఆమె తన మనసులోని మాటను బయటపెట్టింది. జాన్వి 'దడక్' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
'దడక్' చిత్రం విడుదల అయ్యాక, జాన్వి కపూర్ గుంజన్ సక్సేనా, రూహీ, గుడ్ లక్ జెర్రీ, మిలీ లాంటి బాలీవుడ్ చిత్రాలలో నటించింది. ప్రస్తుతం ఈమె నటించిన 'మిస్టర్ అండ్ మిసెస్ మహి' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే 'బవాల్' అనే మరో హిందీ చిత్రానికి కూడా జాన్వి (Janhvi Kapoor) సైన్ చేసింది.
Read More: జాన్వీ కపూర్ తాజా సినిమా 'గుడ్ లక్ జెర్రీ' సినిమాపై నయనతార ప్రశంసలు.. ఆనందంలో బాలీవుడ్ బ్యూటీ!