అవసరమైతే ఆ విషయాన్ని నా రక్తంతో రాసిస్తా: జాన్వీ కపూర్ (Janhvi Kapoor) సంచలన కామెంట్స్

Updated on Oct 15, 2022 04:09 PM IST
నెపోటిజంపై బాలీవుడ్ బ్యూటీ క్వీన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు
నెపోటిజంపై బాలీవుడ్ బ్యూటీ క్వీన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు

బాలీవుడ్‌లో ఎక్కువగా వినిపిస్తున్న పదం నెపోటిజం (Nepotism). హిందీ ఇండస్ట్రీలో ప్రస్తుతం రాణిస్తున్న నటుల్లో ఎక్కువ మంది వారసత్వంతో వచ్చిన వారే ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. సినీ పరిశ్రమకు రావాలనుకునే యువ ప్రతిభావంతులను అడ్డుకుంటున్నారని.. స్టార్స్ తమ వారసులకే అవకాశాలు కల్పిస్తున్నారని బాలీవుడ్‌లో వాదనలు ఊపందుకున్నాయి. అందుకే హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఏమాత్రం సంబంధం లేకుండా, బయటి నుంచి వచ్చి స్టార్‌గా ఎదిగిన యువ నటుడు సుశాంత్ సింగ్ హఠాన్మరణంతో అక్కడ నెపోటిజంపై చర్చలు మొదలయ్యాయి. ఇదే క్రమంలో కొందరు నటుల సినిమాలకు బాయ్‌కాట్ ట్రెండ్ కూడా నడుస్తోంది.   

బాలీవుడ్ లో ఉన్న స్టార్స్ వారసులపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ నడుస్తున్నాయి. తాజాగా క్యూట్ బ్యూటీ, దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor)పై కూడా ట్రోలింగ్ జరుగుతోంది. ఈ విషయంపై జాన్వీ స్పందించారు. తనలో పెద్దగా టాలెంట్ లేకున్నా.. కష్టపడేతత్వంతో ఈ స్థాయికి చేరుకున్నానని జాన్వీ అన్నారు. ‘నేను ప్రతిభావంతురాల్ని కాకపోవచ్చు. నేనంత అందగత్తెనూ కాదు. కానీ కష్టపడేతత్వం వల్లే ఈ స్థాయికి చేరుకున్నా’ అని ట్రోల్స్‌కు జాన్వి గట్టి కౌంటర్ ఇచ్చారు. 

ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముచ్చటిస్తున్న సమయంలో జాన్వీ పైవ్యాఖ్యలు చేశారు. ‘నా గురించి చాలా మందిలో ఓ దురభిప్రాయం ఉంది. అయితే ఓ విషయాన్ని క్లారిటీగా చెప్పాలని అనుకుంటున్నా. నేను వారసత్వంతో వచ్చి.. స్టార్‌డమ్ సంపాదించాలని అనుకోవడం లేదు. నాకంటూ సొంతంగా ఒక గుర్తింపు పొందాలని భావిస్తున్నా. నేను గొప్ప టాలెంటెడ్ కాదు. పెద్ద అందగత్తెనూ కాదు. అయినా నాకు ఇచ్చిన పనిని వంద శాతం నిబద్ధతతో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నా. సెట్‌లో ఎంతో కష్టపడి పని చేస్తా. ఇదే విషయాన్ని కావాలంటే నా రక్తంతో కూడా రాసిస్తా. నా పనితీరుపై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. సవాళ్లను ఎదుర్కొంటూ పని చేయడం నాకు చాలా ఇష్టం’ అని జాన్వి చెప్పుకొచ్చారు.

కాగా, ఇటీవలే ‘గుడ్ లక్’ జెర్రీలో కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం ‘మిలి’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాను బోనీ కపూర్  నిర్మిస్తుండగా.. మత్తుకుట్టి జేవియర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే రిలీజైన ఈ సినిమా టీజర్ అందర్నీ ఆకట్టుకుంటోంది. టీజర్‌లో డైలాగులు లేకపోయినా.. జాన్వి నటన, ఆమె పలికించిన హావభావాలు మూవీపై అంచనాలు పెంచే విధంగా ఉన్నాయి. 

Read more: Junior NTR : జూనియర్ ఎన్టీఆర్, జాన్వి కపూర్ కాంబినేషన్‌లో తెలుగు సినిమా ? ఈ వార్త నిజమా .. రూమరా?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!