రివ్యూలు ఫాలో అవుతానంటున్న అక్కినేని నాగార్జున (Nagarjuna).. పాజిటివ్ టాక్‌పై రివ్యూల ప్రభావం ఉంటుందని కామెంట్

Updated on Sep 14, 2022 06:48 PM IST
అక్కినేని నాగార్జున (Nagarjuna) హీరోగా నటిస్తున్న ది ఘోస్ట్ సినిమా విడుదలకు రెడీ అవుతోంది
అక్కినేని నాగార్జున (Nagarjuna) హీరోగా నటిస్తున్న ది ఘోస్ట్ సినిమా విడుదలకు రెడీ అవుతోంది

అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు అక్కినేని నాగార్జున (Nagarjuna). ఆ తర్వాత తన స్టైల్, అందంతో టాలీవుడ్‌లో మన్మథుడిగా, కింగ్‌గా ప్రేక్షకుల అభిమానాలు పొందారు. నాగ్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు 30 సంవత్సరాలు పూర్తవుతోంది. అయినప్పటికీ అదే ఎనర్జీ, జోష్‌తో సినిమాలు చేస్తుంటారు నాగార్జున. ప్రస్తుతం సినిమాలతోపాటు బిగ్‌బాస్‌ షోకు హోస్ట్‌గా కూడా చేస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నారు.

నాగార్జున కీలకపాత్రలో నటించిన బ్రహ్మాస్త్ర సినిమా విడుదలై మంచి టాక్‌ తెచ్చుకుంది. ఈ క్రమంలో నాగ్‌ మీడియాతో మాట్లాడారు. సినిమా రివ్యూలపై పలు కామెంట్లు చేశారు. సినిమాకు పాజిటివ్ టాక్‌ వచ్చే విషయంలో రివ్యూలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు నాగార్జున.  రణ్‌బీర్‌కపూర్‌, అలియాభట్‌ హీరోహీరోయిన్లుగా నటించిన బ్రహ్మాస్త్ర సినిమాను అయాన్‌ ముఖర్జీ తెరకెక్కించారు. ఈ సినిమాలో నాగార్జున (Nagarjuna) నంది అస్త్రంగా నటించారు.

అక్కినేని నాగార్జున (Nagarjuna) హీరోగా నటిస్తున్న ది ఘోస్ట్ సినిమా విడుదలకు రెడీ అవుతోంది

ఒకప్పుడు వారం తర్వాత..

తాను కూడా రివ్యూలు చూశాకే సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు చూస్తానని నాగార్జున అన్నారు. ‘ఒకప్పుడు సినిమా రివ్యూలు వారం తర్వాత పత్రికలు, సినీ మాగ్యజైన్స్‌లో మాత్రమే వచ్చేవి. అప్పటికి ఆ సినిమా థియేటర్లలో ఉందో.. వెళ్లిపోయిందో కూడా చాలా మందికి తెలిసేది కాదు. దాంతో అప్పుడు ఆ రివ్యూలను ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు.

ఇటీవల సోషల్‌ మీడియా, వార్తలు అందించే వేదికలు ఎక్కువయ్యాయి. దీంతో రివ్యూలకు డిమాండ్‌ పెరిగింది. సినిమా టాక్‌లో రివ్యూలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. నేను కూడా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూడాలంటే ముందు ఐఎండీబీ రేటింగ్స్‌ చూస్తాను. కనీసం వెయ్యి రివ్యూలు, 7 రేటింగ్‌ ఉంటేనే ఆ సినిమా చూస్తా. లేదంటే టైమ్‌ వేస్ట్‌ కదా’ అని చెప్పుకొచ్చారు నాగ్

అక్కినేని నాగార్జున (Nagarjuna) హీరోగా నటిస్తున్న ది ఘోస్ట్ సినిమా విడుదలకు రెడీ అవుతోంది

అప్పుడు తమిళం, మలయాళం.. ఇప్పుడు జర్మన్, కొరియన్..

‘ఒకప్పుడు తమిళం, మలయాళం భాషల సినిమాలను మాత్రమే చూసేవాళ్లం. వేరే భాషల సినిమాలను అంతగా చూసేవాళ్లం కాదు.  ఎవరైనా చెబితే బెంగాలీ సినిమాలు చూసేవాళ్లం. ఇప్పుడు జర్మన్‌, కొరియన్‌, ఫ్రెంచ్‌ ఇలా అన్ని భాషల సినిమాలనూ చూసేస్తున్నాం. ఓటీటీల రాకతో సినిమా చచ్చిపోతుందని చాలా మంది అంటుంటారు. కానీ,  నా అభిప్రాయంలో మాత్రం  ఓటీటీల రాకతో సినిమా మరింతగా పెరుగుతోంది. అయితే అందుకు అనుగుణంగా దర్శకులు, నటులు కూడా అప్‌డేట్‌ అవుతూ ఉండాలి’ అని అన్నారు నాగార్జున (Nagarjuna).

Read More: కొత్తదనానికి కేరాఫ్‌ అడ్రస్‌ టాలీవుడ్‌ కింగ్ నాగార్జున (Nagarjuna).. అభిమానుల కోసం బర్త్‌డే స్పెషల్‌ !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!