కమల్ హాసన్ (Kamal Haasan) ‘భారతీయుడు2’ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ ఇచ్చిన కథా రచయిత!

Updated on Sep 10, 2022 05:37 PM IST
కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా నటించిన విక్రమ్‌ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.
కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా నటించిన విక్రమ్‌ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.

లోకనాయకుడు కమల్‌ హాసన్ (Kamal Haasan) – శంకర్‌‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ఇండియన్‌2. భారతీయుడు సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. చాలా కాలం క్రితమే మొదలైన ఈ సినిమా షూటింగ్‌ అనుకోని కారణాలతో ఆగిపోయింది. అయితే అడ్డంకులు తొలగిపోవడంతో షూటింగ్‌ మరోసారి మొదలైంది. ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఇండియన్‌2 సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

రాంచరణ్‌తో సినిమా తెరకెక్కిస్తున్న శంకర్.. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్‌కు కాస్త బ్రేక్ ఇచ్చి ఇండియన్‌2 షూటింగ్ మొదలు పెట్టునున్నారని టాక్. ఇక, ఇండియన్‌2 సినిమాకు సంబంధించిన మరో బిగ్ అప్‌డేట్‌ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమా రన్‌టైం ఎంత అనే దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది.

కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా నటించిన విక్రమ్‌ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.

‘విక్రమ్‌’ సినిమా విజయంతో..  

చాలాకాలంగా సరైన హిట్‌ కోసం ఎదురుచూస్తున్నారు కమల్ హాసన్ (Kamal Haasan). ఆయన ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్‌ పడేలా.. ఇటీవల రిలీజైన ‘విక్రమ్’ సినిమా కమల్‌కు గ్రేట్‌ కమ్‌బ్యాక్ ఇచ్చింది. విక్రమ్‌ సినిమా ఇచ్చిన జోష్‌తో ఇండియన్‌2 సినిమాను మరోసారి పట్టాలెక్కించేశారు కమల్. 1996లో కమల్ హీరోగా శంకర్ దర్శకత్వంలో విడుదలైన యాక్షన్ థ్రిల్లర్ ‘భారతీయుడు’.

ఈ సినిమా అప్పట్లో ట్రెండ్ సెట్‌ చేసింది. దానికి సీక్వెల్‌గా ఇండియన్‌2 సినిమా తీయాలని ప్లాన్‌ చేశారు శంకర్‌‌ – కమల్. ఇక, ఇండియన్‌2 సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రెడ్ జెయింట్ మూవీస్, లైకా ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా ఇండియన్‌2 సినిమాను తెరకెక్కిస్తున్నాయి. అనిరుధ్‌ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ సెప్టెంబర్‌‌ 3వ వారంలో మొదలు కానుంది.

ఇండియన్‌2 సినిమాకు కథ అందిస్తున్న జయ మోహన్ సినిమా రన్‌టైమ్‌పై ఆసక్తికర కామెంట్లు చేశారు. ఆయన మాటల ప్రకారం భారీ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న కమల్‌ హాసన్‌ (Kamal Haasan) భారతీయుడు2 రన్ టైం దాదాపుగా 3 గంటల 10 నిమిషాల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. అయితే దీనిపై పూర్తి క్లారిటీ రావాలంటే మాత్రం కొన్నిరోజులు ఆగాల్సిందే.

 Read More : రికార్డులు సృష్టిస్తున్న కమల్ హాసన్(Kamal Haasan) ‘విక్రమ్’ మూవీ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!