బాలకృష్ణ (BalaKrishna) ‘ఎన్‌బీకే108’ సినిమా నుంచి అరవింద్‌ స్వామిని తప్పించారా? తప్పుకున్నారా?

Updated on Sep 09, 2022 01:13 PM IST
బాలకృష్ణ (BalaKrishna) , అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమాను వచ్చే వేసవికి రిలీజ్ చేయనున్నారని టాక్
బాలకృష్ణ (BalaKrishna) , అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమాను వచ్చే వేసవికి రిలీజ్ చేయనున్నారని టాక్

బాలకృష్ణ (BalaKrishna) – అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనుంది. ఎన్‌బీకే108 వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కించనున్న ఈ సినిమాపై బాలయ్య అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఎన్‌బీకే107 సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం టర్కీలో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయిన తర్వాత ఎన్‌బీకే108 సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు బాలకృష్ణ.

ఎన్‌బీకే108 సినిమాలో బాలకృష్ణను సరికొత్తగా చూపించనున్నట్టు దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పారు. ఈ చిత్రంలో కూతురు సెంటిమెంట్‌ కూడా ఉండనుందని సమాచారం. అందుకే ఎన్‌బీకే108లో బాలకృష్ణ (Balakrishna) కూతురుగా పెళ్లిసందD ఫేమ్ శ్రీలీలను (Sree Leela) ఎంపిక చేశారు. తాజాగా ఈ సినిమా గురించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ ఒకటి నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది.

బాలకృష్ణ (BalaKrishna) , అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమాను వచ్చే వేసవికి రిలీజ్ చేయనున్నారని టాక్

వేరే యాక్టర్‌‌ కోసం..

‘ఎన్‌బీకే108’లో కీలకపాత్ర కోసం తమిళ నటుడు అరవింద్ స్వామిని (Arvind Swamy) ఎంపిక చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ క్యారెక్టర్‌‌ కోసం వేరే నటుడిని చిత్ర యూనిట్ సంప్రదిస్తోందని టాక్. భారీ రెమ్యునరేషన్‌ డిమాండ్ చేస్తున్న కారణంగానే అరవింద్ స్వామిని కాకుండా వేరే యాక్టర్‌‌ కోసం చిత్ర యూనిట్‌ సంప్రదింపులు జరుపుతోందని తెలుస్తోంది.

రోజా, బొంబాయి సినిమాల తర్వాత తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు అరవింద్ స్వామి (Arvind Swamy). మెగాపవర్‌‌స్టార్ రాంచరణ్ హీరోగా చేసిన ‘ధృవ’ సినిమాలో విలన్‌గా నటించి మెప్పించారు. ఈ సినిమాలో ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు. ధృవ సినిమా తర్వాత అరవింద్‌కు టాలీవుడ్‌ సినిమాల్లో చాలా ఆఫర్లే వచ్చాయి. అయితే ఆయన భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారని టాక్. అందుకే ఈ మధ్యకాలంలో అరవింద్‌ స్వామి మరే సినిమాలోనూ కనిపించలేదు.

బాలకృష్ణ (BalaKrishna) – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఎన్‌బీకే108 సినిమా నుంచి కూడా ఈ కారణంగానే అరవింద్‌ స్వామిని తప్పించారని సమాచారం. ప్రస్తుతం ఈ పాత్ర కోసం.. మరో స్టార్ యాక్టర్‌‌ను చిత్ర యూనిట్ సంప్రదిస్తోందని తెలుస్తోంది. ఈ వార్తలే గనుక నిజమైతే అరవింద్ స్వామి అభిమానులు తెలుగు సినిమాల్లో అతన్ని చూసే అవకాశం దాదాపు లేనట్టే మరి.  

Read More : టర్కీలో హోటల్‌లో బాలకృష్ణ (BalaKrishna).. సామాన్యుడితో సరదాగా ముచ్చటించిన బాలయ్య (pinkvilla.com)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!