చిన్న లాజిక్ మిస్ అయినా వెంకటేష్‌ (Venkatesh) కథ ఓకే చేయరు: ఎఫ్‌3 సినిమాపై రచయిత పరుచూరి గోపాలకృష్ణ కామెంట్లు

Updated on Aug 13, 2022 04:48 PM IST
శ్రీకట్న లీలలు సినిమాలో చేసిన తప్పులనే వెంకటేష్‌ (Venkatesh), వరుణ్‌ తేజ్‌ (VarunTej) ఎఫ్‌3లో అనిల్ రావిపూడి చేసినట్లనిపించిందన్నారు పరుచూరి
శ్రీకట్న లీలలు సినిమాలో చేసిన తప్పులనే వెంకటేష్‌ (Venkatesh), వరుణ్‌ తేజ్‌ (VarunTej) ఎఫ్‌3లో అనిల్ రావిపూడి చేసినట్లనిపించిందన్నారు పరుచూరి

వెంకటేష్‌ (Venkatesh)‌, వరుణ్‌ తేజ్‌ (Varun Tej) హీరోలుగా తెరకెక్కిన సినిమా ‘ఎఫ్‌-3’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. మిల్కీ బ్యూటీ తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటించిన ఎఫ్‌3 సినిమాలో మురళీ శర్మ, రఘుబాబు, సునీల్ కీలకపాత్రలు పోషించారు.

ఎఫ్‌3 సినిమాపై సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ పలు ఆసక్తికర కామెంట్లు చేశారు. ఎఫ్‌2 సినిమాతో పోల్చి చూస్తే ఎఫ్‌3 సినిమా అంతగా బాగాలేదని అన్నారాయన. గతంలో తాము చేసిన తప్పే ఇప్పుడు దర్శకుడు అనిల్‌ రావిపూడి కూడా చేశారా అనే అనుమానం కలిగిందని అన్నారు పరుచూరి. ‘ఎఫ్‌-3’ సినిమాపై ‘పరుచూరి పలుకులు’ కార్యక్రమంలో మాట్లాడారు.

వెంకటేష్‌ (Venkatesh), వరుణ్‌ తేజ్‌ (VarunTej) హీరోలుగా నటించిన ఎఫ్‌2, ఎఫ్‌3 సినిమా పోస్టర్లు

ఎఫ్‌2 సినిమాతో పోలిస్తే..

‘ఒక్క ముక్కలో చెప్పాలంటే ‘ఎఫ్‌-2’ చూసిన కళ్లతో ‘ఎఫ్‌-3’ సినిమా చూస్తే అంత బాగా లేదనిపించింది. కలెక్షన్స్‌ పరంగా చూసుకున్నా.. ఈ చిత్రానికి అద్భుతమైన వసూళ్లు రాలేదనే అనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకూ ఈ సినిమా రూ.100 కోట్లకుపైగా వసూలు చేసింది. దాదాపు రూ.250 కోట్లు వసూలు చేసి ఉంటే ‘ఎఫ్‌-2’ సినిమాతో సమానమై ఉండేది.

ఈ మధ్యనే ఎఫ్‌3 సినిమా చూశాను. గతంలో ‘శ్రీ కట్న లీలలు’లో మేము చేసిన పొరపాటే అనిల్‌ రావిపూడి ఈ సినిమా సెకండాఫ్‌లో చేశారనే అనుమానం కలిగింది. సెకండాఫ్‌కి వచ్చేసరికి కథ వేరే విధంగా మారిపోయింది. ఒక చీటింగ్‌ డ్రామాని 40 నిమిషాలు నడిపించారు. చిన్నప్పుడు తప్పిపోయిన తన కొడుకు రాక కోసం ఎదురుచూస్తున్నానని, ఆ కొడుక్కి ఇప్పుడు సుమారు 20 ఏళ్లు ఉంటాయని మురళీ శర్మ ప్రకటించడం.. అది చూసి, డబ్బు కోసం తానే కొడుకునంటూ వెంకటేష్‌ వెళ్లినట్టు చూపించారు ఎఫ్‌3 సినిమాలో. వెంకీ వయసు మనందరికీ తెలుసు.

శ్రీకట్న లీలలు సినిమాలో చేసిన తప్పులనే వెంకటేష్‌ (Venkatesh), వరుణ్‌ తేజ్‌ (VarunTej) ఎఫ్‌3లో అనిల్ రావిపూడి చేసినట్లనిపించిందన్నారు పరుచూరి

లాజిక్ సెట్‌ కాలేదు..

ఆయనను ఇరవైయేళ్ల కొడుకు పాత్రలో చూపించడం లాజిక్‌గా అనిపించదు. మేము వెంకటేష్‌కు చాలా సినిమాలు రాశాం. కథలో ఏ కాస్త లాజిక్‌ మిస్‌ అయినా ఆయన ఒప్పుకోరు. అలాంటిది ఈ క్యారెక్టర్‌‌ను వెంకీ ఎలా ఓకే చేశారో అర్థం కావడం లేదు. తమన్నాకు మీసాలు పెట్టి అబ్బాయిలా చూపించడం, తాము కూడా కొడుకులమేనంటూ వెన్నెల కిషోర్‌, వరుణ్‌ తేజ్‌ రావడం.. సెకండాఫ్‌లో వచ్చే సీన్స్‌ అర్థం పర్థం లేని కామెడీలా అనిపించాయి

సెకండాఫ్‌లో ఈ 40 నిమిషాలు వేరేలా చూపించి ఉంటే సినిమా మరోలా ఉండేదని అనుకుంటున్నాను. సినిమా క్లైమాక్స్‌లో వరుణ్‌తేజ్‌.. మురళీ శర్మ వారసుడని, వెంకీ, తమన్నా, రాజేంద్రప్రసాద్‌.. ఇతర పాత్రధారులందరూ చెబుతారు. అదే సీన్‌ని మెయిన్‌ పాయింట్‌గా తీసుకుని వరుణ్‌ని మురళీ శర్మ వారసుడిగా నిరూపించేందుకు వాళ్లందరూ ప్రయత్నిస్తున్నట్టు డ్రామా నడిపి ఉంటే సినిమా బాగుండేదని అనిపించింది.  

కథలో చాలా లాజిక్స్ మిస్ అయినప్పటికీ ఎఫ్‌3 సినిమాకు మంచి టాక్ వచ్చిందంటే దానికి కారణం సినిమా చివరి 20 నిమిషాలే. వెంకటేష్ (Venkatesh)‌, వరుణ్‌ తేజ్‌ (Varun Tej) క్యారెక్టర్లను రియల్ హీరోలుగా చూపించారు దర్శకుడు అనిల్. అయితే ఎఫ్‌2 సినిమాలో లాగా ఎఫ్‌3 సినిమాలో మనసుకు హత్తుకునే డ్రామా లేదు అని పరుచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు.

Read More : చిరంజీవి (Chiranjeevi) ‘ఆచార్య’ సినిమాపై రచయిత పరుచూరి గోపాలకృష్ణ షాకింగ్ కామెంట్స్.. సోషల్ మీడియాలో వైరల్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!