Virata Parvam: విరాట ప‌ర్వం ట్రైల‌ర్ రిలీజ్ - ఒక యుద్ధం ఎన్నో ప్రాణాలు తీస్తుంది.. కానీ అదే యుద్ధం ఒక ప్రాణం పోసింది. 

Updated on Jun 05, 2022 06:59 PM IST
Virata Parvam: టాలీవుడ్ హీరో రానా ద‌గ్గుబాటి న‌టించిన విరాట ప‌ర్వం సినిమా ట్రైల‌ర్ రిలీజ్ అయింది.
Virata Parvam: టాలీవుడ్ హీరో రానా ద‌గ్గుబాటి న‌టించిన విరాట ప‌ర్వం సినిమా ట్రైల‌ర్ రిలీజ్ అయింది.

Virata Parvam: టాలీవుడ్ హీరో రానా ద‌గ్గుబాటి న‌టించిన విరాట ప‌ర్వం సినిమా ట్రైల‌ర్ రిలీజ్ అయింది. రానా(Rana Daggubati), సాయిప‌ల్ల‌వి (Sai Pallavi) హీరో హీరోయిన్లుగా న‌టించిన ఈ సినిమాకు వేణు ఊడుగుల ద‌ర్వ‌క‌త్వం వ‌హించారు. 'ర‌వ‌న్న ద‌ళం వ‌చ్చింది.. రా' అంటూ సాగే ట్రైల‌ర్‌లో ఎన్నో ఎమోష‌న్స్ ఉన్నాయి. తెలంగాణ న‌క్స‌లిజం నేప‌థ్యంలో ఈ సినిమా తెర‌కెక్కింది. న‌క్స‌లైట్లు ప్ర‌జ‌ల కోసం ఎలాంటి పోరాటం చేశార‌నే క‌థ‌ను వేణు ఊడుగుల‌ విరాట ప‌ర్వంలో చూపించారు. రానా, సాయి ప‌ల్ల‌వి మ‌ధ్య ప్రేమ ఈ సినిమాకు మ‌రో హైలెట్‌గా నిల‌వ‌నుంది. 

'ఒక యుద్ధం ఎన్నో ప్రాణాలు తీస్తుంది.. కానీ అదే యుద్ధం ఒక ప్రాణం పోసింది.. నేను వెన్న‌ల ఇదే నా క‌థ' అంటూ సాయి ప‌ల్ల‌వి డైలాగులు ట్రైల‌ర్ చివ‌రిలో పేలాయి. న‌క్స‌లిజం ద్వారానే ప్ర‌జ‌ల కాపాడుకోగ‌లం అని న‌మ్మే పాత్ర‌లో రానా న‌టించారు. రానా పోరాట‌పై రాసిన ర‌చ‌న‌ల‌ను చ‌దివిన‌ సాయి ప‌ల్ల‌వి అత‌నిని ప్రేమిస్తుంది. ఎలాగైనా రానాను క‌ల‌వాల‌నుకుంటుంది. రానాను క‌లిసిన సాయి ప‌ల్ల‌వికి ఎలాంటి ప‌రిస్థుతులు ఎదుర‌వుతాయి.. చివ‌ర‌కు వీరిద్ద‌రి క‌థ ఎలా ముగుస్తుందో తెలుసుకోవాలంటే.. సినిమా రిలీజ్ వ‌ర‌కు ఆగాల్సిందే. విరాట ప‌ర్వం (Virata Parvam) సినిమాను తెలంగాణ‌లో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా తీశారు. 

Virata Parvam: కార‌ణంగా విరాట ప‌ర్వం సినిమా వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. క‌రోనా త‌ర్వాత విడుద‌ల చేద్దామ‌నుకుంటే భారీ బ‌డ్జెట్ చిత్రాల విడుద‌ల‌తో ఆగిపోయింది. ఇక ఓటీటీలో విరాట ప‌ర్వం రిలీజ్ చేస్తార‌నే వార్త‌లు చ‌క్క‌ర్లు కొట్టాయి. విరాట ప‌ర్వం సినిమాను థియేట‌ర్ల‌లోనే విడుద‌ల చేస్తామ‌ని చిత్ర యూనిట్ తెలిపింది.  జూన్ 17న విరాట ప‌ర్వం సినిమా రిలీజ్ కానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్ల జోరు పెంచింది. హీరోయిన్ ప్రియ‌మ‌ణి (Priyamani) కీల‌క‌పాత్ర‌లో న‌టించారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందించాడు. శ్రీల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌రా సినిమాస్ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి విరాట ప‌ర్వం సినిమాను నిర్మించారు.

Read More: https://telugu.pinkvilla.com/entertainment/virata-parvam-movie-updates-435

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!