విరాట ప‌ర్వం (Virata Parvam) ప్ర‌మోష‌న్లను కొత్త ఐడియాతో మొద‌లు పెట్టిన‌ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్

Updated on Jun 01, 2022 10:46 AM IST
విరాట ప‌ర్వం  (Virata Parvam)సినిమా నుంచి ఓ సాంగ్ రిలీజ్ చేయ‌నున్నారు. 
విరాట ప‌ర్వం  (Virata Parvam)సినిమా నుంచి ఓ సాంగ్ రిలీజ్ చేయ‌నున్నారు. 

టాలీవుడ్‌లో రానా ద‌గ్గుపాటి(Rana Daggubati)మంచి గుర్తింపు ఉన్న స్టార్ హీరో. హీరోయిజం, విల‌నిజంల‌తో వెండితెర‌పై రానా చెల‌రేగిపోతారు. అయితే రానా సినిమా విరాట ప‌ర్వం రిలీజ్‌కు బ్రేక్ ప‌డుతూనే వ‌చ్చింది. విరాట ప‌ర్వం ఓటీటీలోనే రిలీజ్ అవుతుందేమోన‌నే టాక్ కూడా వినిపించింది. ఐయితే విరాట ప‌ర్వం ఓటీటీలో రిలీజ్ చేయ‌డం లేద‌ని.. థియేట‌ర్ల‌లోనే త్వ‌ర‌లో రిలీజ్ చేస్తామ‌ని మూవీ మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ప్ర‌క‌ట‌న చేసిన‌ట్టుగానే విరాట ప‌ర్వం అప్‌డేట్స్ ఇస్తున్నారు. ప్ర‌స్తుతం విరాట ప‌ర్వం  (Virata Parvam)సినిమా నుంచి ఓ సాంగ్ రిలీజ్ చేయ‌నున్నారు. 

కామ్రెడ్‌గా న‌టిస్తున్న రానా ద‌గ్గుబాటి.

రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా విరాట ప‌ర్వం (Virata Parvam) లో న‌టించారు. నందిత దాస్, ప్రియమణి, నివేత పేతురేజ్‌లు కీల‌క పాత్రల్లో న‌టిస్తున్నారు. విరాట ప‌ర్వం చిత్రం వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుంది. క‌థ సినిమాకు బ‌లం కానుంద‌ని కిట్రిక్స్ అంటున్నారు. న‌క్స‌లిజం నేప‌థ్యంలో ఈ సినిమాను తీశారు. కొత్త క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌కు వినోదం పంచాల‌కునే రానా విరాట ప‌ర్వంలో కామ్రేడ్‌గా మెప్పించ‌నున్నారో లేదో చూడాలి. 

విరాట ప‌ర్వం (Virata Parvam) నుంచి ఓ పాట విడుద‌ల చేస్తున్నామంటూ సురేష్ ప్రొడ‌క్ష‌న్ ఓ వీడియో రిలీజ్ చేసింది. పాత త‌రంలో దూర‌ద‌ర్శ‌న్‌లో వార్త‌లు చ‌దివే విధానంలో వీడియో చేసింది. ఆకాశవాణి ముఖ్యాంశాలు అంటూ.. నగదారిలో పాట గురించిన వివ‌రాలు తెలిపారు. విరాట పర్వం ప్రమోషన్స్ జూన్ 2 నుంచి స్టార్ట్ అవుతున్నాయ‌ని చిత్ర యూనిట్ తెలిపింది. 

విరాట ప‌ర్వం చిత్రాన్ని ఆలస్యంగా రిలీజ్ చేస్తున్నారు.

విరాట ప‌ర్వం  (Virata Parvam) సినిమాను సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.  నిజానికి చాలా రోజుల క్రితమే షూటింగ్  పూర్తయింది. కానీ విరాట ప‌ర్వం విడుద‌ల‌కు అడ్డంకులు ఎదుర‌య్యాయి. క‌రోనా వ‌ల్ల లేట్ అవుతూ వాయిదా ప‌డింది. ఆ త‌ర్వాత థియేట‌ర్ల‌లో ఆర్.ఆర్.ఆర్, కేజీఎఫ్ చాప్ట‌ర్2 వంటి సినిమాల కార‌ణంగా మూవీ మేక‌ర్స్ రిలీజ్‌కు టైం తీసుకున్నారు. రీసెంట్‌గా విరాట ప‌ర్వం ఎప్పుడూ రిలీజ్ చేస్తున్నారో అధికారికంగా ప్ర‌క‌టించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా జూన్ 17న విరాట ప‌ర్వం చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఇక‌ చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్ల జోరు పెంచ‌నుంది. వ‌రుస అప్‌డేట్స్‌తో సినిమాపై పాజిటివ్ టాక్ వ‌చ్చేలా ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్ట‌నున్నారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!