రానా(Rana Daggubati) న‌టించిన విరాట ప‌ర్వం థియేట‌ర్ల‌కు రాన‌ట్టేనా!

Updated on May 05, 2022 04:14 PM IST
రానా విరాట ప‌ర్వం  సినిమా టీజ‌ర్ ఏడాది క్రితం రిలీజ్ అయింది. దర్శకుడు వేణు ఉడుగుల మాత్రం థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయ‌డం లేదు. సాయి ప‌ల్లవి ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తుంది. 
రానా విరాట ప‌ర్వం  సినిమా టీజ‌ర్ ఏడాది క్రితం రిలీజ్ అయింది. దర్శకుడు వేణు ఉడుగుల మాత్రం థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయ‌డం లేదు. సాయి ప‌ల్లవి ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తుంది. 

లీడ‌ర్‌గానే కాదు లీడ్ రోల్ చేసి ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడు రానా ద‌గ్గుబాటి (Rana Daggubati) . రానా క‌థ‌కు బ‌లం ఉన్న సినిమాలు సెలెక్ట్ చేసుకుంటారు. కానీ విరాట ప‌ర్వం  సినిమా టీజ‌ర్ ఏడాది క్రితం రిలీజ్ అయింది. దర్శకుడు వేణు ఉడుగుల మాత్రం థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయ‌డం లేదు. సాయి ప‌ల్లవి ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తుంది. 

బాహుబ‌లిలో విల‌న్  రోల్‌తో  రానా ద‌గ్గుబాటి(Rana Daggubati)  త‌న‌ న‌ట విశ్వ‌రూపం చూపారు. ఆ త‌ర్వాత రానా సీరియ‌స్ రోల్ క్యారెక్ట‌ర్లు చేస్తున్నారు. ఘాజీ, నేనే రాజు నేనే మంత్రి వంటి సినిమాల‌తో మంచి పేరు తెచ్చుకున్నారు. రానా  హీరోగానే కాకుండా విలన్ పాత్ర‌ల‌తోనూ మెప్పించారు. బాహుబ‌లి త‌ర్వాత పవన్ కళ్యాణ్ నటించిన  భీమ్లా నాయక్‌లో స‌పోర్టింగ్ రోల్ చేసి ఆశ్చ‌ర్య ప‌రిచారు. 

విరాట ప‌ర్వం

విరాట ప‌ర్వం  రానా చేస్తున్న సినిమాల్లో ఒక‌టి.  రానాకు జోడిగా సాయిప‌ల్లవి న‌టిస్తున్నారు. ద‌ర్శ‌కుడు వేణు తీసిన సినిమా క‌రోనా వ‌ల్ల రిలీజ్ కాలేదు. విరాట ప‌ర్వం టీజ‌ర్‌ను రిలీజ్ చేసి సంవ‌త్స‌రం దాటుతుంది. షూటింగ్ మొత్తం పూర్త‌యినా రిలీజ్‌కు టైం కుద‌ర‌లేదు. టాప్ హీరోల సినిమాలు వ‌ర‌స‌గా రిలీజ్ అవుతున్నా.. రానా సినిమాను మాత్రం రిలీజ్ చేయ‌లేదు.

దర్శకుడు వేణు ఉడుగుల తెరకెక్కించిన విరాట‌ప‌ర్వం సినిమాలో రానా (Rana Daggubati)  ఓ నక్సలైట్ పాత్రలో నటిస్తున్నాడు. తెలంగాణలో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ సినిమా తీశారు.  విరాట ప‌ర్వం సినిమా ఉంద‌నే  విష‌యాన్నే ప్రేక్ష‌కులు మ‌రిచిపోయారు. కొన్ని సీన్లను ద‌ర్శ‌కుడు మార్పులు చేస్తున్నార‌ట‌. ప్రియమణి, నందితా దాస్, ఈశ్వరి రావులు ఈ సినిమాలో న‌టిస్తున్నారు.  సుధాకర్ చెరుకూరి, సురేష్ బాబు విరాట ప‌ర్వం సినిమా ప్రొడ్యూస‌ర్లు.

 

విరాట ప‌ర్వం

విరాట ప‌ర్వం సినిమాపై సోష‌ల్ మీడియాలో ర‌క‌ర‌కాల  క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తార‌ని అంటున్నారు. ఇక థియేట‌ర్ల‌లో  విరాట ప‌ర్వం చూడ‌టం సాధ్యం కాదా అని రానా ఫ్యాన్స్ అడుగుతున్నారు. విరాట ప‌ర్వం సినిమా రిలీజ్ థియేట‌ర్ల‌లోనా.. ఓటీటీలోనా .. అంటే వెయిట్ చేసి చూడాల్సిందే. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!