Virata Parvam: రానా న‌టించిన‌ విరాట ప‌ర్వంలోని నగాదారిలో లిరిక‌ల్ సాంగ్ రిలీజ్

Updated on Jun 02, 2022 03:02 PM IST
Virata Parvam: విరాట ప‌ర్వం  సినిమా  నుంచి న‌గాదారిలో లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు.
Virata Parvam: విరాట ప‌ర్వం సినిమా నుంచి న‌గాదారిలో లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు.

Virata Parvam: విరాట ప‌ర్వం  సినిమా  వ‌రుస ప్ర‌మోష‌న్ల‌తో జోరు పెంచింది. రానా ద‌గ్గుబాటి, సాయి ప‌ల్ల‌వి జంట‌గా ఈ సినిమాలో న‌టిస్తున్నారు. వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో విడుద‌ల అవుతున్న విరాట ప‌ర్వం నుంచి న‌గాదారిలో లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. నిప్పు ఉంది.. నీరు ఉంది.. న‌గాదారిలో అంటూ ఈ పాట అద్భుత‌మైన లిర‌క్స్‌తో సాగింది. 

విరాట ప‌ర్వం (Virata Parvam) చిత్రంలోని న‌గాదారిలో పాట‌ను వ‌రం పాడారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. న‌రేంద‌ర్ రెడ్డి, సాన‌పాటి భ‌ర‌ద్వాజ్ లిరిక్స్ రాశారు. మూడేళ్ల క్రితం విరాట ప‌ర్వం సినిమా మొద‌లైంది. క‌రోనాతో పాటు అనేక కార‌ణాల‌తో విడుద‌ల లేట‌యింది.  తెలంగాణ ప్రాంతంలో జరిగిన నక్సలైట్ ఉద్యమం నేప‌థ్యంలో ఈ సినిమాను తెర‌కెక్కించారు. రీసెంట్‌గా రిలీజ్ అయిన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకులను  ఆకట్టుకున్నాయి.
 

శ్రీ లక్ష్మి వేంకటేశ్వర సినిమా, సురేశ్ ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా విరాట ప‌ర్వం చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. డీ సురేశ్ బాబు, సుధాకర్ చెరుకూరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రానా, సాయిప‌ల్ల‌వితో పాటు ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర, ఈశ్వరీ రాము, నివేదా పేతురాజ్‌లు న‌టిస్తున్నారు. విరాట పర్వం (Virata Parvam) సినిమాను జూలై 17న రిలీజ్ చేయనున్నారు. 

విరాట ప‌ర్వం (Virata Parvam) నుంచి నగాదారిలో పాట విడుద‌ల చేస్తున్నామంటూ సురేష్ ప్రొడ‌క్ష‌న్ ఓ వీడియో రిలీజ్ చేసింది. పాత త‌రంలో దూర‌ద‌ర్శ‌న్‌లో వార్త‌లు చ‌దివే విధానంలో వీడియో చేసింది. ఆకాశవాణి ముఖ్యాంశాలు అంటూ.. నగాదారిలో పాట గురించిన వివ‌రాలు తెలిపారు. విరాట పర్వం ప్రమోషన్స్ జూన్ 2 నుంచి స్టార్ట్ అవుతున్నాయ‌ని చిత్ర యూనిట్ తెలిపింది. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!