'ఆర్‌సీ 15' నుంచి త‌మిళ న‌టుడి ఫ‌స్ట్ లుక్ రిలీజ్.. చ‌ర‌ణ్ (Ram Charan) కోసం రంగంలోకి దిగిన‌ ఎస్‌.జే సూర్య !

Updated on Sep 09, 2022 02:18 PM IST
 రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) ఆర్‌సీ 15 చిత్రంలో  ఎస్‌.జే సూర్య భాగ‌మ‌వ‌డంతో సినిమాపై అంచ‌నాలు మ‌రింత పెరిగాయి.
రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) ఆర్‌సీ 15 చిత్రంలో ఎస్‌.జే సూర్య భాగ‌మ‌వ‌డంతో సినిమాపై అంచ‌నాలు మ‌రింత పెరిగాయి.

RC15: టాలీవుడ్ హీరో రామ్ చ‌ర‌ణ్ (Ram Charan), త‌మిళ స్టార్ ద‌ర్శ‌కుడు శంక‌ర్ కాంబోలో 'ఆర్‌సీ 15' తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన మ‌రో అప్‌డేట్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ప్ర‌ముఖ త‌మిళ‌ ద‌ర్శ‌కుడు, న‌టుడు ఎస్‌.జె సూర్య 'ఆర్‌సీ 15' లో న‌టించ‌నున్నారు. ఎస్‌.జే సూర్య ఈ చిత్రంలో భాగ‌మ‌వ‌డంతో సినిమాపై అంచ‌నాలు మ‌రింత పెరిగాయి.

శంక‌ర్ మొద‌టిసారి తెలుగులో ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సినిమా 'ఆర్‌సీ 15'. 'భార‌తీయుడు', 'రోబో' వంటి బ్లాక్ బాస్ట‌ర్ హిట్స్ అందించిన శంక‌ర్ తెలుగులో రామ్ చ‌ర‌ణ్ (Ram Charan)తో 'ఆర్‌సీ 15' సినిమాను తెరకెక్కిస్తున్నారు

 రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) ఆర్‌సీ 15  చిత్రంలో  ఎస్‌.జే సూర్య భాగ‌మ‌వ‌డంతో సినిమాపై అంచ‌నాలు మ‌రింత పెరిగాయి.

ఎస్‌.జే సూర్య ఫ‌స్ట్ లుక్‌

'ఆర్‌సీ 15' సినిమా బ్లాక్ బాస్ట‌ర్ హిట్ కొట్టేలా శంక‌ర్ ప్లాన్ చేస్తున్నారు. న‌టీన‌టుల‌తో పాటు టెక్నీషియ‌న్ల‌ను తీసుకునే విష‌యంలో కూడా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. 'ఆర్‌సీ 15' నుంచి తాజాగా ఎస్‌.జే సూర్య (SJ Surya) ఫ‌స్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఎస్‌.జే సూర్య ఇదే చిత్రంలో కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. 

ఈ సినిమాకి సంబంధించి రామ్ చ‌ర‌ణ్ కొత్త గెట‌ప్ ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ విభిన్న పాత్ర‌లో క‌నిపించ‌నున్నార‌ని స‌మాచారం. 'ఆర్‌సీ 15'లో  రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) కు జోడిగా కైరా అద్వానీ (Kiara Advani) న‌టిస్తున్నారు. ‘రాధేశ్యామ్’ సినిమాకు ప‌నిచేసిన ర‌వింద‌ర్‌ను 'ఆర్‌సీ 15'కు ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా నియ‌మించార‌ట‌. 

ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కులు త‌మ‌న్ 'ఆర్‌సీ 15' చిత్రానికి మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. శంక‌ర్, రామ్ చ‌ర‌ణ్ కాంబో సినిమా షూటింగ్ హైద‌రాబాద్, ఆంధ్ర‌ప్ర‌దేశ్, పంజాబ్, మ‌హారాష్ట్రాల‌లో జ‌ర‌గ‌నుంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌రా క్రియేష‌న్స్ ప‌తాకంపై నిర్మాత‌లు దిల్‌రాజు, శిరిష్ నిర్మిస్తున్నారు.

Read More: రామ్ చరణ్ (Ram Charan) నయా లుక్ వైరల్.. RC15 కోసమా.. లేక యాడ్ షూట్ కోసమా!

Advertisement
Credits: Twitter

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!