రామ్ చరణ్ (Ram Charan) నయా లుక్ వైరల్.. RC15 కోసమా.. లేక యాడ్ షూట్ కోసమా!

Updated on Sep 04, 2022 06:18 PM IST
తాజాగా రామ్ చరణ్ (Ram Charan Latest Photo Viral) లేటెస్ట్ ఫొటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.
తాజాగా రామ్ చరణ్ (Ram Charan Latest Photo Viral) లేటెస్ట్ ఫొటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఆర్సీ15 చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ గత కొద్దిరోజులుగా శరవేగంగా జరుగుతోంది. అయితే, రామ్ చరణ్-శంకర్ ప్రాజెక్ట్ మీద గత కొన్ని రోజుల క్రితం రకరకాల కథనాలు పుట్టుకొచ్చాయి. Rc15 ప్రాజెక్ట్‌ను శంకర్ పక్కన పెట్టేశాడని, అందుకే 'ఇండియన్ 2' సినిమాను స్టార్ట్ చేశాడంటూ రూమర్లు వచ్చాయి.

అయితే, ఆ రూమర్లన్నిటికీ డైరెక్టర్ శంకర్ (Director Shankar) గట్టిగానే సమాధానం ఇచ్చాడు. తాను రెండు సినిమాలను సమాంతరంగా పూర్తి చేస్తానని, సెప్టెంబర్ మొదటి వారంలో రామ్ చరణ్ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలుపెడతానని శంకర్ ట్వీట్ వేశాడు. దీంతో రూమర్లన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి.  

రామ్ చరణ్ లేటెస్ట్ ఫొటో (Ram Charan Latest Photo)

ఇదిలా ఉంటే.. తాజాగా రామ్ చరణ్ (Ram Charan Latest Photo Viral) లేటెస్ట్ ఫొటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. రామ్ చరణ్ సూట్ ధరించి హెలికాఫ్టర్ లో నుంచి దిగుతున్న పిక్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంది. ఈ ఫొటోలో రామ్ చరణ్ గాగుల్స్ ధరించి యమా స్టైల్ గా కనిపిస్తున్నాడు. అయితే ఈ ఫోటోలు శంకర్ సినిమా కోసమా? లేదా ఏదైనా యాడ్ కోసమా? అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. 

కాగా, ఈ చిత్రం పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇందులో రామ్ చరణ్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారట. గతంలో ఈ సినిమా నుంచి రామ్ చరణ్ లుక్స్ కొన్ని నెట్టింట వైరల్ గా (Ram charan Looks Viral) మారాయి. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. 

టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) నిర్మిస్తోన్న ఈ మూవీలో కియారా అద్వానీ (Kiara Adwani) కథానాయికగా నటిస్తోంది. సముద్రఖని, శ్రీకాంత్, అంజలి వంటి ప్రముఖ నటులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

Read More: క్రేజీ కాంబినేషన్ : RC 15 తర్వాత.. శంకర్ (Shankar) తో సినిమా చేసే టాలీవుడ్ సూపర్ స్టార్ ఎవరు ?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!