RRR Movie: ఆర్ఆర్ఆర్ ఓ 'గే' సినిమా అంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్.. ఆర్జీవీని ఆడుకుంటున్న నెటిజన్లు!

Updated on Jun 03, 2022 06:38 PM IST
ఆర్జీవీ, ఎన్టీఆర్, రామ్ చరణ్ (RGV,NTR, Ramcharan)
ఆర్జీవీ, ఎన్టీఆర్, రామ్ చరణ్ (RGV,NTR, Ramcharan)

టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన విజువల్ వండర్ 'ఆర్ఆర్ఆర్'. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో మన అందరికి తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రికార్డులు సృష్టించింది. ఈ సినిమా చూసి జనం ఫిదా అయిపోయారు. 1920ల కాలం నాటి కల్పిత కథను వెండితెరపై అత్యద్భుతంగా ఆవిష్కరించారు రాజమౌళి. స్వాతంత్య్ర సమరయోధులైన కొమురం భీం, అల్లూరి సీతారామరాజులను అలా ఆకాశానికెత్తారు. ఇక ఈ చిత్రంలో ప్రధాన పాత్రధారులైన రామ్ చరణ్, తారక్ మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎక్సలెంట్ గా వర్కవుట్ అయింది. బ్రోమాన్స్..స్నేహం, ప్రేమ పై విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రాన్ని హాలీవుడ్ క్రిటిక్స్ సైతం మెచ్చుకున్నారు.

ఇటీవల ఈ సినిమా ఓటీటీలో కూడా విడుదల కావడంతో ప్రపంచవ్యాప్తంగా మన ప్రేక్షకులు ఎంతో ఇష్టంగా వీక్షించారు. బాహుబలి సినిమా తరువాత రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాలో టాలీవుడ్ లో ఇద్దరు అగ్ర హీరోలు అయిన రామ్ చరణ్ ఎన్టీఆర్ లు కలిసి ఆర్ఆర్ఆర్ అనే ఒక మల్టీస్టారర్ సినిమాను తెరపైకి తీసుకు వచ్చాడు. అలాగే ఈ సినిమాలో ఇద్దరు హీరోలకు సమానంగా ఇంపార్టెన్స్ ను ఇచ్చారు. ఇకపోతే ఈ సినిమా ఇండియాలోనే బాక్సాఫీస్ వద్ద అత్యధికంగా కలెక్షన్లు అందుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,200 కోట్ల కలెక్షన్లను సాధించింది. ఇటీవల ఈ సినిమా ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో హిందీ లో విడుదల కాగా విదేశీయుల నుంచి కూడా భారీ స్థాయిలో స్పందన లభించడం విశేషం.

ఇదిలా ఉంటే.. ఒక వర్గం ప్రేక్షకులు మాత్రం సినిమాపై గే తరహా స్టోరీ అని కామెంట్స్ చేస్తూ ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నెటిజన్లు రామ్ చరణ్, తారక్ మధ్య ఉన్నది గే రిలేషన్ షిప్ అని ట్వీట్ చేస్తున్నారు. ముఖ్యంగా వెస్ట్రన్ నెటిజన్లు.. ఇలా వరుస ట్వీట్లు చేస్తున్నారు. అయితే, ఈ చిత్రం గే మూవీ అని ఎందుకు చెప్పలేదని అడుగుతున్నారు. కాగా, ఆ ట్వీట్లపై వచ్చిన వార్త కథనాన్ని ట్వీట్ చేసిన వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ.. నేను ముందే చెప్పానన్నట్లు ట్వీట్ చేశాడు. ‘నేను చెప్పిందే నిజం..వెస్ట్రన్ ఆడియన్స్ దృక్పథంలో ఆర్ఆర్ఆర్ గే స్టోరి’ అని పేర్కొన్నాడు. మొత్తంగా ఈ రకమైన కామెంట్లతో RRR మూవీ మళ్లీ హైలైట్ అవుతోంది. 

అయితే, ఆర్జీవీ గతంలోనే చరణ్–ఎన్టీఆర్ కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలపై అతి జుగుప్సాకరమైన కామెంట్లు చేయడం చర్చనీయాంశమైంది. ‘అలాంటోడు కాబట్టే, అలాంటి ఆలోచనలు వస్తాయ్..’ అని వర్మని చాలా మంది తిట్టి పోశారు. అలా జనం తనను తిట్టుకంటోంటే, పైశాచికనందం పొందడం ఆయనకు అలవాటే. బహుశా చరణ్, ఎన్టీఆర్ ఫిజిక్ చూసి.. సహజంగానే కొందరు ‘గే’లకి మూడ్ వచ్చి ఉండొచ్చు.. అలాగే వర్మకి కూడా అనిపించవచ్చని చాలామంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి వస్తున్న పాజిటివ్ టాక్ ను చూసి పాపం, ఆర్జీవీకి కన్నుకుట్టినట్టుంది. అందుకే, ఈ ‘గే’ ప్రచారం మొదలెట్టాడు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!