నిఖిల్‌ (Nikhil) హీరోగా నటించిన కార్తికేయ2 సినిమాపై డైరెక్టర్ రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) కామెంట్లు

Updated on Aug 21, 2022 10:25 PM IST
నిఖిల్‌ (Nikhil) కార్తికేయ2 సినిమా కలెక్షన్లు హిందీ సినిమాల కంటే బాగున్నాయని రాంగోపాల్  వర్మ (Ram Gopal Varma) ట్వీట్ చేశారు.
నిఖిల్‌ (Nikhil) కార్తికేయ2 సినిమా కలెక్షన్లు హిందీ సినిమాల కంటే బాగున్నాయని రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) ట్వీట్ చేశారు.

వివాదాస్పద కామెంట్లు చేయడంలో రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) ముందుంటారు. ఏ విషయం గురించైనా మొహమాటం లేకుండా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడుతుంటారు వర్మ. ఈ ఏడాది బాలీవుడ్‌లో చాలా సినిమాలు రిలీజైనా కేవలం మూడు సినిమాలకు మాత్రమే ప్రేక్షకుల ఆదరణ లభించింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన పెద్ద స్టార్ల సినిమాలు కూడా మినిమం కలెక్షన్లు సాధించలేక చతికిలపడ్డాయి. అదే సమయంలో ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్2’ సినిమాలు ఇప్పటికే వసూళ్ల సునామీ సృష్టించగా.. నిఖిల్‌ (Nikhil) ‘కార్తికేయ 2’ సినిమా హిందీలో కలెక్షన్లు సాధిస్తున్నాయి.

ఈ పరిణామంపై ఇప్పటికే పలుమార్లు రాంగోపాల్‌వర్మ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. బాలీవుడ్ సినిమాలపైనా విమర్శలు చేశాడు. ఆగస్టు 12న విడుదలైన ‘కార్తికేయ 2’ అక్కడి స్టార్ల సినిమాలను వెనక్కి నెట్టి మంచి కలెక్షన్లు సాధిస్తోంది. నిఖిల్ హీరోగా నటించిన ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహించారు. ఈ సినిమాపై వర్మ ట్వీట్ చేశారు.

నిఖిల్‌ (Nikhil) కార్తికేయ2 సినిమా కలెక్షన్లు హిందీ సినిమాల కంటే బాగున్నాయని రాంగోపాల్  వర్మ (Ram Gopal Varma) ట్వీట్ చేశారు.

రెండో వారంలోనూ మంచి కలెక్షన్లు..

‘నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించగా అభిషేక్ నిర్మించిన చిత్రం కార్తికేయ 2. ఈ మూవీ విడుదలై రెండో వారంలో కూడా మంచి కలెక్షన్లు సాధిస్తోంది. హిందీ బెల్ట్‌లో ఆమిర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా, అక్షయ్ కుమార్ నటించిన రక్షాబంధన్ సినిమాలకంటే రెండు రెట్లు ఎక్కువగా వసూళ్లు సాధిస్తోంది కార్తికేయ2. ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కేజీయఫ్ 2 కంటే కార్తికేయ2 సినిమానే గొప్ప చిత్రం. చందు మొండేటికి కంగ్రాట్స్’ అని ట్విట్టర్‌‌లో రాసుకొచ్చారు వర్మ (Ram Gopal Varma)

మొదట తక్కువ థియేటర్స్‌లో విడుదలైన ‘కార్తికేయ2’ హిట్ టాక్ రావడం.. ఆమిర్, అక్షయ్ సినిమాలు ఫ్లాప్‌ టాక్‌ రావడంతో కార్తికేయ2 సినిమాకి థియేటర్స్ పెరుగుతూ వచ్చాయి. కార్తికేయ2 సినిమా విడుదలై పది రోజులు అవుతున్నా ఇప్పటికీ హౌస్‌ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతోంది. దాదాపు రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన నిఖిల్‌ (Nikhil) కార్తికేయ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.60 కోట్లకి పైగా కలెక్షన్లు సాధించింది.

Read More : నిఖిల్‌ (Nikhil) హీరోగా నటించిన కార్తికేయ2 సినిమా నైజాం కలెక్షన్లు ఎంతంటే?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!