ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ (RRR) సినిమాపై రాంగోపాల్ వర్మ (RGV) సంచలన కామెంట్లు.. సర్కస్‌ చూసినట్టు ఉందన్న డైరెక్టర్

Updated on Aug 23, 2022 02:11 PM IST
తాను మణిశర్మ కలిసి సినిమా స్టోరీ డిస్కషన్‌లో కూర్చున్నామని, అయితే వాళ్లిద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని రాం గోపాల్ వర్మ (RGV) చెప్పారు
తాను మణిశర్మ కలిసి సినిమా స్టోరీ డిస్కషన్‌లో కూర్చున్నామని, అయితే వాళ్లిద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని రాం గోపాల్ వర్మ (RGV) చెప్పారు

సంచలనాలకు మారుపేరైన దర్శకుడు రాంగోపాల్ వర్మ (RGV). ఆయన ఏం మాట్లాడినా, ఏ కామెంట్ చేసినా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది సినిమా విషయమైనా, రాజకీయ, సామాజిక అంశమైనా. ఏ విషయంపైనైనా సరే రాంగోపాల్ వర్మ కామెంట్ చేశారంటే అది వైరల్ కావాల్సిందే.

ఇక, జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ (RRR). ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి సంచలనాలు నమోదు చేస్తూనే ఉంది. రిలీజైన తర్వాత రికార్డులు సృష్టించింది. ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమాలో నటనకుగాను జూనియర్ ఎన్టీఆర్‌‌ ఆస్కార్‌‌కు ఎంపికయ్యారనే వార్తలు కూడా వచ్చాయి. తాజాగా రాంగోపాల్ వర్మ ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమాపై సంచలన కామెంట్లు చేశారు.

ఇటీవల తాను థియేటర్‌లో చూసిన చిత్రం ‘ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌’ అని.. అదొక సర్కస్‌లా అనిపించిందని రామ్‌గోపాల్‌ వర్మ అన్నారు. తన కామెంట్స్‌ను తప్పుగా అర్థం చేసుకోవద్దని.. సర్కస్‌ చూస్తున్నప్పుడు ఎలాంటి ఉత్సాహం కలుగుతుందో.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా చూస్తున్నప్పుడు అలాగే అనిపించిందన్నారు. ముఖ్యంగా సినిమాలో వంతెన దగ్గర పిల్లాడిని కాపాడే సీన్‌లో రాంచరణ్‌, తారక్‌ జెమినీ సర్కస్‌ చేస్తున్న భావన కలిగిందని చెప్పారు ఆర్జీవీ.

తాను మణిశర్మ కలిసి సినిమా స్టోరీ డిస్కషన్‌లో కూర్చున్నామని, అయితే వాళ్లిద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని రాం గోపాల్ వర్మ (RGV) చెప్పారు

చావు అంటే భయం లేదు..

ఒక ఫిల్మ్‌ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాంగోపాల్ వర్మ కొన్ని ఆసక్తికర ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. చావు అంటే తనకు భయం లేదని, అయితే, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందా? అనే ఆసక్తి మాత్రం ఉందన్నారు. ప్రస్తుతం తాను ప్రతి నిమిషాన్నీ ఆస్వాదిస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ ఈ ప్రపంచంలో తాను చేయడానికి ఏమీ లేకపోతే, విసుగ్గా అనిపిస్తే, అప్పుడు దాని గురించి ఆలోచిస్తానన్నారు.

సినిమాలు ఎప్పటికీ తనకు బోర్‌గా అనిపించవని స్పష్టం చేశారు. మణిరత్నం గురించి అడగ్గా.. ‘మణిరత్నానికి నా చిత్రాలేవీ నచ్చవు. అలాగే, నాకు ఆయన తీసే చిత్రాలు నచ్చవు. అయితే, ఒకసారి ఇద్దరం కలిసి స్క్రిప్ట్‌ వర్క్‌లో కూర్చొన్నాం. నా మాట ఆయన వినలేదు. ఆయన మాట నేను వినలేదు. ఆ చిత్రాలు ‘దొంగ దొంగా’, ‘గాయం’. అయినా కూడా సినిమాలో మా పేర్లు కలిపి వేసుకున్నాం’ అని చెప్పారు రాంగోపాల్ వర్మ (RGV). ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ (RRR) సినిమాపై ఆర్జీవీ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

Read More : ద‌ర్శ‌క ధీరుడికి హాలీవుడ్ ద‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు.. రూసో బ్రదర్స్‌ను క‌లుస్తాన‌న్న‌ రాజ‌మౌళి (SS Rajamouli)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!