Ladki Movie: బుర్జ్ ఖలీఫా పై ఆర్జీవీ 'లడ్కీ' మూవీ ట్రైలర్.. చైనాలో రికార్డు స్థాయిలో 40వేల థియేటర్లలో విడుదల!
Ladki Movie: వైవిధ్యభరిత చిత్రాలతోపాటు విభిన్నమైన ప్రయోగాలు చేయడంలో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ దిట్ట. దుబాయ్‌కి చెందిన నిర్మాణ సంస్థ ఆర్ట్‌సీ మీడియా, చైనీస్ ప్రొడక్షన్ మేజర్ బిగ్ పీపుల్ బ్యానర్స్ పై ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం ఐదు భాషల్లో ఈ నెల 15న విడుదల కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషలతోపాటు చైనాలోనూ ఈ చిత్రాన్ని ఏకకాలంలో విడుదల చేయనున్నారు. హిందీలో ‘లడ్‌కీ’, చైనీస్‌లో ‘గర్ల్ ‘డ్రాగన్’ పేరుతో అనువదిస్తున్నారు. తెలుగులో మాత్రం ‘అమ్మాయి’ టైటిల్ తో తెరకెక్కుతోంది.
కాగా, ఈ సినిమా ట్రైలర్‌ను ప్రపంచంలోనే అత్యంత పొడవైన బూర్జ్ ఖలీఫాపై ప్రదర్శించారు. ఇందులో కథానాయిక పాత్రధారి పూజా బాలేకర్ (Pooja Bhalekar) టైక్వాండో నేషనల్ ఛాంపియన్. అయినప్పటికీ ఈ చిత్రానికి గానూ చైనాలోని షావోలిన్ టెంపుల్‌లో శిక్షణ తీసుకున్న నిపుణుల పర్యవేక్షణలో బ్రూస్‌లీ స్టైల్ అయినటువంటి జీత్ కునేడోలో ట్రైనింగ్ ఇచ్చారు. 'బ్రూస్‌లీ పట్ల నాకున్న అభిమానంతో తీసిన చిత్రమిది. రెండు దశాబ్ధాల కల ఇది'' అని ఆర్‌జీవీ ట్వీట్ చేశారు.
కాగా, చైనాలో విడుదల కాబోతున్న తొలి భారతీయ చిత్రంగా “లడ్‌కీ: ఎంటర్ ది గర్ల్ డ్రాగన్” (Ladki Movie) మూవీ నిలువనుంది. చైనీస్ భాషలో “గర్ల్ ‘డ్రాగన్” పేరుతో దాదాపు 40000 థియేటర్‌లలో విడుదల చేయడానికి వర్మ సన్నాహాలు చేస్తున్నారు. ఇండియన్ స్క్రీన్ మీద భారీ విజయం సాధించిన ‘దంగల్’ 9000 థియేటర్లలో, ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ 12000, ‘బాహుబలి’ 6000 థియేటర్‌లలో విడుదల కాగా, ‘లడ్‌కీ’ చిత్రం మాత్రం 40000 థియేటర్‌లలో విడుదలకానుండటం విశేషం.