KONDAA TRAILER 2: కొట్టి కొట్టి చంపురా.. అంటూ సాగిన ఆర్జీవీ (Ram Gopal Varma) కొండా సినిమా ట్రైలర్
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) తెలంగాణ రాజకీయ నేపథ్యంలో కొండా (Konda) సినిమాను తెరకెక్కిస్తున్నారు. రాజకీయ నేతలైన కొండా మురళి, సురేఖల జీవితం ఆధారంగా కొండా సినిమా తీస్తున్నారు. ఈ సినిమాలో అదిత్ అరుణ్ కొండా మురళి పాత్రలో నటించారు. కొండా సురేఖ రోల్‌ను ఐరా మోర్ పోషించారు. పృథ్వీరాజ్ ప్రత్యర్థిగా యాక్ట్ చేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న కొండా ట్రైలర్ 1 విడుదల చేశారు. ఆట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రామ్ గోపాల్ వర్మ కొండా (Konda) సినిమాపై ఆసక్తి పెంచేందుకు మరో ట్రైలర్‌ను విడుదల చేశారు.
కొట్టి.. కొట్టి.. చంపురా.. కత్తులతో పొడుసురా అంటూ సాగిన కొండా సినిమాలో పాట ఉత్కంఠ కలిగిస్తుంది. కొండా మురళి, సురేఖలు ఇంతటి పోరాటం చేసి నాయకులుగా ఎదిగారా అని అశ్చర్యం వేస్తుంది. కామ్రెడ్‌లతో కలిసి దుర్మార్గులను చంపే సీన్స్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. పోరాటాలతో తెలంగాణ పెత్తందారుల వ్యవస్థను కూల్చేసే కథగా కొండా సినిమా రానుంది. కొండా మురళికి సురేఖ ఎలా మద్దతు తెలిపింది.. ఇద్దరూ రాజకీయాల వైపు ఎందుకు వచ్చారనేది తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే. ఆర్జీవి (Ram Gopal Varma) దర్శకత్వంలో వస్తున్న 'కొండా' (Konda) సినిమా జూన్ 23న రిలీజ్ కానుంది.